IPL 2023: ప్రతి సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెరుగ్గా, మరింత ఉత్తేజకరమైనదిగా చేయడానికి కొన్ని వినూత్న అంశాలను పరిచయం చేస్తూనే ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఐపీఎల్‌లో అందరూ ఎక్కువ గమనించే విషయాలు ఇవే.
1. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రకారం, టాస్ సమయంలో జట్టు ప్లేయింగ్ XIతో పాటు నలుగురు ప్రత్యామ్నాయాలను జాబితా చేయాలి. వారు తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ నలుగురిలో ఎవరినైనా ఉపయోగించవచ్చు. ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, ఓవర్ చివర్లో, వికెట్ పడ్డాక, బ్యాటర్ రిటైర్ అయినప్పుడు ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకురావచ్చు.
2. అత్యధిక పారితోషికం తీసుకునే ముగ్గురు ఆటగాళ్లు బెన్ స్టోక్స్, శామ్ కరన్, కామెరాన్ గ్రీన్ ఎలా ఆడతారు?
వేలంలో అందుబాటులో ఉన్న స్టార్ ఆల్ రౌండర్ల సేవలను పొందేందుకు ఫ్రాంచైజీలు తమ బ్యాంకును ఖాళీ చేశాయి. రూ.18.50 కోట్లతో శామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కరన్‌తో పాటు, బెన్ స్టోక్స్, కామమరూన్ గ్రీన్ కూడా వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్నారు. బెన్ స్టోక్స్‌ను చెన్నై కొనుగోలు చేయగా, కామెరాన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్‌ను కూడా రూ.13.25 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
3. ఇండియన్ స్టార్ ఆటగాళ్లపై దృష్టి
చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని తన చివరి IPL సీజన్ ఇదే కావచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ బ్యాటర్లపై అందరి దృష్టి కూడా ఉంది. ఐపీఎల్ మునుపటి ఎడిషన్‌లో సీనియర్ బ్యాటర్లు అంత బాగా ఆడలేదు.