Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మొదట బౌలింగ్ చేయనుంది.


పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనూ, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎనిమిదోై స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచినా ఎనిమిదో స్థానంలోనే ఉంటారు. ఎందుకంటే ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కూడా ఐదు విజయాలతో 10 పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో గెలిచినా వారి దగ్గర ఎనిమిది పాయింట్లే అవుతాయి. కానీ టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశం ఉండాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్ గెలవాల్సిందే.


మరో వైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎనిమిదో స్థానానికి చేరనుంది. కానీ టోర్నీలో నిలబడాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి.


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, నారాయణ్ జగదీశన్, లాకీ ఫెర్గూసన్, కుల్వంత్ ఖేజ్రోలియా.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రాహుల్ త్రిపాఠి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, సన్వీర్ సింగ్.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 పాయింట్ల పట్టిక మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. చాలా వరకు జట్లన్నీ పదో నంబర్‌ జంక్షన్‌లో జామ్‌ అయ్యాయి. నాలుగు జట్లు 10 పాయింట్లు, రెండు జట్లు 11 పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్‌ చేరుకొనేందుకు ఇవన్నీ గట్టిగా పోరాడే అవకాశం ఉంది. టేబుల్‌ టాపర్‌ సంగతి పక్కన పెడితే కనీసం మూడు జట్లు స్వల్ప మార్జిన్‌తోనే ప్లేఆఫ్‌ చేరుకొనేలా కనిపిస్తోంది.


ఐపీఎల్‌ 2023లో బుధవారం రెండు మ్యాచులు జరిగాయి. మొదటి పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడ్డాయి. రెండో మ్యాచులో ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఢీకొన్నాయి. ఈ మ్యాచుల తర్వాతే పాయింట్ల పట్టికలో ట్రాఫిక్‌ జామ్‌ పెరిగిపోయింది.


ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. మరో మూడు బంతులు మిగిలునప్పుడు వర్షం మొదలైంది. ఎంతకీ ఎడతెరపి నివ్వలేదు. దాంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛేదనకు రాలేకపోయింది. సాయంత్రం 7 గంటల వరకు వేచిచూసిన నిర్వాహకులు రెండు జట్లకు చెరో పాయింటును పంచేశారు. దాంతో మెరుగైన రన్‌రేట్‌ 0.639 ఉన్న లక్నో రెండో పొజిషన్లో నిలిచింది. 10 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడింది. ఇక చెన్నైదీ ఇదే పరిస్థితి. 0.329 రన్‌రేట్‌, 11 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. పదింట్లో ఐదు గెలిచి నాలుగు ఓడింది. ఒక ఫలితం తేలలేదు.