SRH vs DC Interesting Facts: ఐపీఎల్‌లో ఈరోజు (ఏప్రిల్ 29వ తేదీ) రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడి, ఐదు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయాయి. ఈ జట్లు మరో మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్ రేసులో వెనుక బడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల పోరు మధ్య హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి.
టీ20 క్రికెట్‌లో భువనేశ్వర్ కుమార్ పైన డేవిడ్ వార్నర్ రికార్డు బాగా లేదు. భువీ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ కేవలం 71 స్ట్రైక్ రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగాడు. డేవిడ్ వార్నర్ కనీసం 40 బంతులు ఆడిన బౌలర్లలో అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్ భువీ మీదనే ఉంది.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి వేగంగా పరుగులు సాధించారు. కుల్‌దీప్ యాదవ్‌పై ఎయిడెన్ మార్క్రమ్ స్ట్రైక్ రేట్ 245 కాగా, రాహుల్ త్రిపాఠి 200 స్ట్రైక్ రేట్‌తో కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో చితక్కొట్టారు.
ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ కేవలం 22 బంతుల్లోనే మనీష్ పాండేను 4 సార్లు పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో మనీష్ పాండే స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే.
2022 నుండి టీ20 క్రికెట్‌లో ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైక్ రేట్ 140కు పైగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ 141, హెన్రిచ్ క్లాసెన్ 145 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లను చిత్తు చేస్తున్నారు.
ఈ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనుంది. ఇక్కడ డేవిడ్ వార్నర్ 31 మ్యాచ్‌ల్లో ఏడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో 885 పరుగులు చేశాడు. అతనికి ఈ మైదానం అంటే చాలా ఇష్టం.
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ (17), సన్‌రైజర్స్ హైదరాబాద్ (29) అతి తక్కువ సిక్సర్లు సాధించిన రెండు జట్లు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపై సన్‌రైజర్స్‌తో ఆడిన గత 5 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయింది.
ఐపీఎల్-16 లో రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ ఓటముల బాట పట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ వైఫల్యాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంటున్న తరుణంలో నేడు ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య నేటి రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.
ఈ సీజన్ ను వరుసగా రెండు ఓటములతో స్టార్ట్ చేసి ఆ తర్వాత పంజాబ్, కోల్‌కతాను ఓడించిన హైదరాబాద్ జట్టు మళ్లీ ఆ తర్వాత ఓటముల బాట పట్టింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై, చెన్నైలతో పాటు గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 145 లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. బ్యాటింగ్ వైఫల్యాలు సన్ రైజర్స్‌ను దారుణంగా వేధిస్తున్నాయి. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ లు దారుణంగా విఫలమవుతున్నారు. గుడ్డిలో మెల్లలా హెన్రిచ్ క్లాసెన్ ఆడుతున్నా అతడి ఆట మ్యాచ్ ను గెలిపించేదైతే కాదు. మరి ఈ మ్యాచ్ లో అయినా సన్ రైజర్స్ బ్యాటింగ్ రైజ్ అవుతుందో లేదో చూడాలి.