Kolkata Knight Riders vs Gujarat Titans: ఐపీఎల్‌ 2023 సీజన్ 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్యాటింగ్ చేయనుంది.


పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడో స్థానంలోనూ, గుజరాత్ టైటాన్స్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా భారీ తేడాతో విజయం సాధిస్తే ఏకంగా మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అదే గుజరాత్ గెలిస్తే వారు మొదటి స్థానానికి వెళ్తారు.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
శుభమాన్ గిల్, శ్రీకర్ భరత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివమ్ మావి, జయంత్ యాదవ్


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
నారాయణ్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి


కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, కుల్వంత్ ఖేజ్రోలియా


నేటి మ్యాచ్ కంటే ముందు గుజరాత్.. కేకేఆర్‌తో ఈనెల 9న అహ్మదాబాద్‌లో ఆడింది.  204 పరుగుల లక్ష్యంలో కేకేఆర్.. రింకూ సింగ్ ఐదు సిక్సర్ల విధ్వంసంతో అనూహ్యంగా ఓటమిపాలైంది.  ఆఖరి ఓవర్ వేసిన జీటీ బౌలర్ యశ్ ధయాల్ ఇంకా కోలుకోలేదు.  ఈ ఓటమికి  గుజరాత్ నేడు ఈడెన్ లో బదులు తీర్చుకోవాలని ఫిక్స్ అయింది.  బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా గుజరాత్.. కేకేఆర్ కంటే స్ట్రాంగ్ గా ఉంది.   గుజరాత్ టాపార్డర్  శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, సాయి సుదర్శన్‌లతో పాటు మిడిల్ లో డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియాలు టచ్ లోనే ఉన్నారు. 


బౌలింగ్‌లో కూడా  షమీకి తోడుగా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ  ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. పంజాబ్, లక్నోలతో  జరిగిన గత రెండు మ్యాచ్ లలో అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. రషీద్ ఖాన్ మాయాజాలం కూడా తోడవడంతో గుజరాత్.. మొన్న లక్నోపై 135 పరుగులను కూడా కాపాడుకుంది. ఇప్పుడు కేకేఆర్ కు కూడా  బదులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. 


ఆడిన 8 మ్యాచ్ లలో మూడు మాత్రమే గెలిచిన కేకేఆర్.. ఇకనుంచి ఆడబోయే ప్రతీ మ్యాచ్  ముఖ్యమే. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే  ఆ జట్టుకు గుజరాత్ తో మ్యాచ్ తో పాటు రానున్న ఐదు మ్యాచ్ లు ఎంతో కీలకం. కానీ ఆ జట్టు బ్యాటింగ్ లో నిలకడ లేదు. జేసన్ రాయ్ మెరుపులు మెరిపిస్తున్నా.. మరో ఓపెనర్  జగదీశన్   ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వెంకటేశ్ అయ్యర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం కేకేఆర్ కు లాభించేదే.  కెప్టెన్ నితీశ్ రాణా కూడా టచ్ లోనే ఉన్నాడు.  ఆఖర్లో వస్తున్నా రింకూ సింగ్ నిలకడగానే బాదుతున్నాడు.  కానీ ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లు ఇంకా  తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.