Shubman Gill wins toss Gujarat Titans to bowl first: ఐపీఎల్‌(IPL)లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌ సీజన్‌ 17ను ఘనంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) గుజరాత్‌ టైటాన్స్‌(GT) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఐపీఎల్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని చెన్నై.. గుజరాత్ వ్యూహాలు రచిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లోనే తన కెప్టెన్సీతో ఆకట్టుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇటు గుజరాత్‌ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్న గిల్‌ కూడా తొలి మ్యాచ్‌లో తన నిర్ణయాలతో మెప్పించాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. 24 ఏళ్ల గిల్‌ ఐపీఎల్‌లోనే అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. గిల్‌కు గుజరాత్‌ ప్రధాన కోచ్‌ ఆశిష్ నెహ్రా నుంచి మంచి సహకారం లభిస్తోంది.



గిల్‌-రుతురాజ్‌ వ్యూహాలే కీలకం
గుజరాత్‌ జట్టులో అనుభవజ్ఞులైన డేవిడ్ మిల్లర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు. వీరిద్దరూ గిల్‌కు సహయకరంగా ఉంటున్నారు. చెన్నైలోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌కు మిస్టర్ కూల్‌, తలైవా ధోనీ అండగా నిలుస్తున్నాడు. అయితే చెన్నైను బౌలింగ్ వైఫల్యం కాస్త ఆందోళన పరుస్తోంది. పేసర్ తుషార్ దేశ్‌పాండే తొలి మ్యాచ్‌లో ఆశించిన మేర రాణించలేదు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టిన తర్వాత కూడా చెన్నై బౌలర్లను ఎదుర్కొంటూ బెంగళూరు బ్యాటర్లు అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బెంగళూరు... చెన్నైకు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. అన్‌ క్యాప్డ్‌ ముఖేష్ చౌదరిని కూడా చెన్నై జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక పేసర్ మతీషా పతిరాణ గాయం నుంచి కోలుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి. రచిన్ రవీంద్రను స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర.. 15 బంతుల్లో 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని రచిన్‌ చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సమీర్ రిజ్వీకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో అతడు సత్తా చాటాలని చూస్తున్నాడు. బెంగళూరు  మ్యాచ్‌లో ధోని కూడా బ్యాటింగ్ చేయలేదు. తలైవా అభిమానులు ధోనీ బ్యాటింగ్‌ చూసేందుకు తహతహలాడుతున్నారు. 



గుజరాత్‌ జోరు సాగేనా
ముంబైతో మ్యాచ్‌లో గెలిచిన టాప్‌  ఆర్డర్‌ బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలం కావడం గుజరాత్‌ను ఆందోళన పరుస్తోంది. గిల్, వృద్ధిమాన్ సాహా భారీ స్కోర్లు చేయాలని గుజరాత్‌ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాలు తమ ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. చెన్నైలో జన్మించిన క్రికెటర్ సాయి సుదర్శన్‌పై గుజరాత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. నెమ్మదిగా ఉండే చెపాక్ పిచ్‌పై రషీద్ ఖాన్, సాయి కిషోర్ కీలక పాత్ర పోషిస్తారు. 
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), MS ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్కర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే, షేక్ రషీద్, మిచెల్ ఎస్. , సిమర్‌జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, మరియు ఆరవెల్లి అవనీష్ రావు 
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోస్హూ లి ఖాన్, , మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్