RR vs PBKS, IPL 2023: ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 5వ తేదీ) రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇది టోర్నీలో ఎనిమిదో మ్యాచ్. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు టోర్నీలో రెండో మ్యాచ్ ఆడనున్నాయి. గౌహతిలో మైదానంలోకి దిగడానికి ముందు, ఇరు జట్లు కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడనున్నాయి. ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో?


ఇరు జట్లు విజయంతో...
ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 72 పరుగుల తేడాతో ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ కింగ్స్ ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది.


పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం 24 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో రాజస్థాన్ 14 మ్యాచ్‌లు గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. అదే సమయంలో ఈ రెండు జట్లూ తలపడ్డ గత ఐదు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ నాలుగు సార్లు విజయం సాధించింది.


ఎవరు గెలిచే అవకాశం ఉంది?
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఎవరు గెలుస్తారో అంచనా వేయాలంటే... గణాంకాల ప్రకారం ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌దే పైచేయి అయినట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లతో పంజాబ్ కింగ్స్ గొప్ప బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉంది. మరోవైపు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శామ్సన్ వంటి బలమైన టాప్ ఆర్డర్‌తో రాజస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది.


ఈ మ్యాచ్ గౌహతిలో జరగనుంది. గౌహతి వేదికగా ఐపీఎల్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే.అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్‌గా నిలవనుంది. ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (మొదట బ్యాటింగ్ చేస్తే)
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కెఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.


ఇంపాక్ట్ ప్లేయర్: సందీప్ శర్మ లేదా కుల్దీప్ సేన్.


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (మొదట బౌలింగ్ చేస్తే)
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కెఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్/మురుగన్ అశ్విన్.


ఇంపాక్ట్ ప్లేయర్: దేవదత్ పడిక్కల్.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు (మొదట బ్యాటింగ్ చేస్తే)
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కరన్, ఎం షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ.


ఇంపాక్ట్ ప్లేయర్: రిషి ధావన్.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు (మొదట బౌలింగ్ చేస్తే)
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కర్రాన్, ఎం షారూఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రిషి ధావన్/రాజ్ అంగద్ బవ్వా


ఇంపాక్ట్ ప్లేయర్: భానుక రాజపక్స.