Injured Players In IPL 2023: ఐపీఎల్-16 మొదలై  వారం రోజులు కూడా కాకముందే ఈ సీజన్‌లో   గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల  సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.  సీజన్ ఆరంభంలోనే  జస్ప్రిత్ బుమ్రా,  రిషభ్ పంత్ లు గాయంతో  దూరమవగా.. ఆ తర్వాత  లీగ్ ఆరంభానికి ఒక్కరోజు ముందే సీఎస్కే బౌలర్ ముఖేశ్ చౌదరి కూడా తప్పుకున్నాడు. తాజాగా  కేన్ విలియమ్సన్ స్థానంలో దసున్ శనక భర్తీ చేసిన నేపథ్యంలో   ఈ లీగ్ లో ఇప్పటివరకు గాయాల కారణంగా   తప్పుకున్న  ఆటగాళ్ల  వివరాలు చూద్దాం.  


వాళ్లిద్దరితో మొదలు.. 


ఐపీఎల్ సీజన్ కంటే రెండు నెలల ముందుగానే  ఈ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోలుకోలేని షాక్ తాకింది.  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్.. ఆరు నెలల పాటు  క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీగా ఉన్న  ముంబై  ఇండియన్స్‌కు కూడా ఫిబ్రవరిలో రెండు భారీ  షాక్ లు తాకాయి.  ఆ జట్టు కీలక పేసర్ జస్ప్రిత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్ లు తమ గాయాలకు శస్త్ర చికిత్సలు చేసుకోవడంతో  ఆ ఇద్దరూ  సీజన్ ను దూరమయ్యారు.  ఫిబ్రవరిలోనే  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ఆల్ రౌండర్ విల్ జాక్స్.. గాయపడి  అతడూ  16వ ఎడిషన్ నుంచి  తప్పుకున్నాడు.  మిగిలిన వారి జాబితా కింది విధంగా ఉంది.  చెన్నై  బౌలర్లు  కైల్  జెమీసన్, ముఖేశ్ చౌదరిలు కూడా సీజన్ కు ముందే తప్పుకున్నారు.  ఇక తాజాగా వెన్ను గాయంతో  కేకేఆర్ సారథి శ్రేయాస్ అయ్యర్ కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే జట్టులో  షకిబ్ అల్ హసన్.. జాతీయ జట్టు విధుల వల్ల ఈ సీజన్ లో ఆడటం లేదు. 


ఐపీఎల్ - 2023 నుంచి తప్పుకున్న ఆటగాళ్లు : 


- ముంబై ఇండియన్స్ : జస్ప్రిత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్ 
- సీఎస్కే : ముఖేశ్ చౌదరి, కైల్ జెమీసన్  
- ఆర్సీబీ : విల్ జాక్స్, రజత్ పాటిదార్,  జోష్ హెజిల్వుడ్ (ఫస్టాఫ్ కు దూరం. సెకండాఫ్ కు వచ్చేదాకా  నమ్మకం లేదు) 
- ఢిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్
- పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్ స్టో 
- రాజస్తాన్ రాయల్స్ : ప్రసిధ్ కృష్ణ 
- గుజరాత్ టైటాన్స్ : కేన్ విలియమ్సన్ 
- కేకేఆర్ : శ్రేయాస్ అయ్యర్, షకిబ్ అల్ హసన్ 


- ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ కూడా  ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో  ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.  అతడి భుజంలో పక్కటెముకకు గాయమైందని.. ఆర్సీబీ తర్వాత ఆడబోయే  మ్యాచ్ లలో అతడు కొన్నింటిని మిస్ కాక తప్పదని  తెలుస్తున్నది. 
- సీఎస్కే  ఆల్ రౌండర్ బెన్  స్టోక్స్   ఈ సీజన్ లో ఆడేందుకు వచ్చినా అతడు బౌలింగ్ చేసేందుకు తంటాలు పడుతున్నాడు.   లక్నోతో మ్యాచ్ లో ఒక ఓవర్ బౌలింగ్ చేసి భారీ పరుగులు సమర్పించుకున్నాడు.  అతడు మోకాలి గాయానికి ఇంజక్షన్లు తీసుకుని ఐపీఎల్ ఆడుతున్నాడని  సీఎస్కే బ్యాటింగ్ కోచ్  మైక్ హస్సీ చెప్పిన విషయం తెలిసిందే.