Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది. ఇప్పుడు ఆ జట్టు ఎలిమినేటర్ ఆడుతోంది. ముంబై తరఫున ఈ సీజన్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు ఆటగాళ్లు తిలక్ వర్మ, నేహాల్ వధేరా. వారిద్దరినీ ప్రశంసిస్తూ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు. వారిని భవిష్యత్ సూపర్ స్టార్ ఆటగాళ్లు అన్నాడు.


ముంబై ఇండియన్స్ తరఫున గత సీజన్‌లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం నేహాల్ వధేరాకు దక్కింది. నేహాల్ వధేరా మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో తిలక్ 9 మ్యాచ్‌ల్లో 274 పరుగులు చేశాడు. కాగా నెహాల్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 214 పరుగులు చేశాడు.


ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడాడు. ముంబైకి ఆడుతున్నప్పుడు కృనాల్, హార్దిక్, బుమ్రా తమ సత్తాను నిరూపించుకున్నారని అన్నారు. తిలక్, నేహాల్ ల కథ కూడా ఇలాగే కనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు భవిష్యత్తులో ముంబై ఇండియన్స్‌కే కాకుండా భారత జట్టుకు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని జోస్యం చెప్పాడు.


రాబోయే 2 సంవత్సరాలలో మీరు తేడాను చూస్తారని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ‘ముంబై ఇండియన్స్ సూపర్ స్టార్ టీమ్ అని అంటారు. కానీ మేం ఇక్కడ స్టార్లను తయారు చేస్తున్నాం. మా టీమ్ స్వయంగా వెళ్లి వారిని చూస్తోంది. మా టీమే వారి టాలెంట్‌ను కనుగొంది.’ అన్నాడు.


ఇది హార్దిక్ పాండ్యాకు రోహిత్ ఇచ్చిన కౌంటర్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘ముంబై స్టార్లను మాత్రమే కొనుగోలు చేస్తుంది.’ అన్నాడు. ఇప్పుడు దీంతో హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చినట్లు అయింది.


ఐపీఎల్‌లో  6వేలకు  పైగా  పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు.   ఐపీఎల్ -16లో ఇప్పటివరకు  11 మ్యాచ్‌లు ఆడిన  హిట్‌మ్యాన్..  191 పరుగులే చేశాడు. గడిచిన ఐదు ఇన్నింగ్స్ లలో   రోహిత్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. తద్వారా  ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 


ఈ సీజన్‌లో పంజాబ్,  చెన్నైపై మ్యాచ్ లలో డకౌట్ అయి   ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (16)  డకౌట్ అయిన  ఆటగాడిగా ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్  తాజాగా  ఐదు వరుస ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్‌కే పరిమితమై మరో  పేలవ రికార్డును నమోదుచేశాడు.  2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న  రోహిత్.. తన 16  ఏండ్ల  సుదీర్ఘ కెరీర్‌లో వరుసగా  ఐదు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించడం ఇదే ప్రథమం. 2017 సీజన్‌లో  రోహిత్ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో  3, 2, 4, 0  తర్వాత  ఇంత చెత్తగా ఆడటం ఇదే ప్రథమం.