RCB vs GT IPL 2024 Head head to records: ఐపీఎల్(IPL) 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్‌లో 700 పరుగులకుపైగా చేశారు. కానీ గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్ , విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బెంగళూరు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 4 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు రెండు మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి.
బెంగళూరు బౌలింగే బలహీనం
బెంగళూరు జట్లను బలహీనమైన బౌలింగ్ వేధిస్తోంది. గత రెండు మ్యాచుల్లో బెంగళూరు బౌలర్లు రాణించినా ఈ సీజన్‌లోని గత మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యారుటీ 20ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించికున్న మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌ను చాటుకోవల్సి ఉంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యష్ దయాల్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ మెరుగ్గా రాణించారు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ, పార్ట్ టైమ్ పేసర్ గ్రీన్ కూడా రాణించండం బెంగళూరుకు బలంగా మారింది.
పిచ్ నివేదిక
చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌పై సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతాయి. ఈ పిచ్‌పై భారీ లక్ష్యాలను కూడా ఛేదిస్తున్నాయి. ఇక్కడి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఇక్కడ మంచు ప్రభావం ఉంటుంది. అది బౌలర్లకు పరీక్షగా మారుతుంది. బెంగళూరు-గుజరాత్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు దాదాపు 28 డిగ్రీలు ఉంటాయి.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు( అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తుది జట్టు( అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ , కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్