MI vs KKR, IPL 2024 Kolkata Knight Riders won by 24 runs: ఐపీఎల్‌(IPL)లో ముంబై(MI) ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతయ్యాయి. మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 145 పరుగులకే కుప్పకూలారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన మిచెల్‌ స్టార్క్‌ ముంబై పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా 19.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 145 పరుగులకే ఆలౌట్‌ అయింది. 


పర్వాలేదనిపించిన కోల్‌కత్తా  
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై.... కోల్‌కతా ను బాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన సాల్ట్ వికెట్ ను కోల్పోవడంతో కొలకత్తా కు తొలి షాక్ తగిలింది.. ఆ తర్వాత వెను వెంటనే ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్... సునీల్ నరైన్ అవుటయ్యారు. తుషారా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి కోల్‌కతా బాటింగ్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత కూడా కోల్‌కతా క్రమం తప్పకుండా వికెట్లు కోలోయింది. కోల్‌కత్తాను ముంబై ఆరంభం నుంచే ఎక్కడికక్కడ కట్టడి చేసింది. 57 పరుగులకే 5 వి కెట్లు కోల్పోయిన దశలో... వెంకటేష్ అయ్యర్.. మనీష్ పాండే...కోల్‌కతా ను ఆదుకున్నారు.. మెల్లమెల్లగా ముంబై బౌలర్లను ఎదుర్కొంటూనే భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్ళేలా కనిపించింది కోల్‌కతా జట్టు. కానీ సరిగ్గా హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న సమయంలో 17వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మనీశ్‌ పాండే క్యాచ్‌ ఔటవ్వడంతో కోల్‌కతాకు తిరిగి కష్టాలు మొదలయ్యాయి.


వచ్చీరాగానే సిక్స్‌తో బోణీ కొట్టిన ఆండ్రూ రస్సెల్‌ ఆడేస్తాడు అనుకొనేంతవరకు కూడా క్రీజులో నిలబడలేకపోయాడు. రనౌట్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. అప్పట్నుంచి ముంబై బౌలర్లు మరింత ధాటిగా బౌలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. దీంతో కోల్‌కతా వరుస వికెట్లను చేజార్చుకుంటూ పోయింది. 18వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ లో రెండు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి రమణ్‌దీప్‌ క్యాచ్‌ ఔటవ్వగా.. స్టార్క్ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక 19.5 ఓవర్ల వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. అప్పటికి వెంకటేష్ 70 పరుగులు చేశాడు. దీంతో ఆలౌట్‌ అయ్యేసరికి కోల్‌కతా 169 పరుగులు చేసింది. ముంబైకి 170 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై బౌలర్లలో తుషార, బుమ్రా మూడేసి వికెట్లు తీశారు. హార్దిక్‌ 2, పీయుష్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.


ముంబై పేకమేడలా...
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు మొదల‌య్యాయి. 13 పరుగులు చేసి ఇషాన్‌ కిషన్‌... 11 పరుగులు చేసి రోహిత్‌ శర్మ అవుటయ్యారు. 11 పరుగులు చేసి నమన్‌ ధార్‌...నాలుగు పరుగులు చేసి తిలక్‌ర్మ అవుటయ్యారు. నెహాల్ వధేరా ఆరు పరుగులు.. హార్దిక్‌ పాండ్యా ఒక పరుగుకే పెవిలియన్‌ చేరడంతో 71 పరుగులకే ముంబై ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కానీ సూర్యకుమార్‌ యాదవ్‌ పోరాడాడు. 35 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 56 పరుగులు చేసి ముంబైని విజయం దిశగా నడిపించాడు. కానీ సూర్యను రస్సెల్‌ అవుట్‌ చేశాడు. టిమ్ డేవిడ్‌ 24 పరుగులు చేసి మళ్లీ ఆశలు చిగురింపజేశాడు. కానీ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన మిచెల్‌ స్టార్క్‌ ముంబై పతనాన్ని శాసించాడు. దీంతో ముంబై 145 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోల్‌కత్తా బౌలర్లలో స్టార్క్‌ నాలుగు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు.