MI vs KKR IPL 2024 Mumbai Indians target 170: ముంబై(MI)తో జరుగుతున్న మ్యాచ్ లో  కోల్‌కతా(KKR) పోరాడే స్కోర్ చేసింది... ఆరంభంలో ముంబై బౌలర్లు రాణించడంతో.... పరుగులు రావడమే గగనమైపోయింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతాను  వెంకటేష్ అయ్యర్... మనీష్ పాండే ఆదుకున్నారు... దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 169 పరుగులకే కుప్పకూలింది. 


మ్యాచ్ సాగిందిలా....
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై.... కోల్‌కతా ను బాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన సాల్ట్ వికెట్ ను కోల్పోవడంతో కొలకత్తా కు తొలి షాక్ తగిలింది.. ఆ తర్వాత వెను వెంటనే ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్... సునీల్ నరైన్ అవుటయ్యారు. తుషారా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసి  కోల్‌కతా బాటింగ్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత కూడా కోల్‌కతా క్రమంతప్పకుండా వికెట్లు కోలోయింది. కోల్‌కతాను ముంబై ఆరంభం నుంచే ఎక్కడికక్కడ కట్టడి చేసింది.  57 పరుగులకే 5 వి కెట్లు కోల్పోయిన దశలో... వెంకటేష్ అయ్యర్.. మనీష్ పాండే...కోల్‌కతా ను ఆదుకున్నారు..  మెల్లమెల్లగా ముంబై బౌలర్లను ఎదుర్కొంటూనే భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్ళేలా కనిపించింది కోల్‌కతా జట్టు కానీ సరిగ్గా  హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న సమయంలో 17వ ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మనీశ్‌ పాండే క్యాచ్‌ ఔటవ్వడంతో కోల్‌కతాకు తిరి  కష్టాలు మొదలయ్యాయి. వచ్చీరాగానే సిక్స్‌తో బోణీ కొట్టిన ఆండ్రూ రస్సెల్‌  ఆడేస్తాడు అనుకొనేంతవరకు కూడా  క్రీజులో నిలబడలేకపోయాడు. రనౌట్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. అప్పట్నుంచి ముంబై బౌలర్లు మరింత ధాటిగా బౌలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. దీంతో    కోల్‌కతా వరుస వికెట్లను చేజార్చుకుంటూ పోయింది. 18వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్ లో రెండు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి రమణ్‌దీప్‌ క్యాచ్‌ ఔటవ్వగా.. స్టార్క్‌  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక 19.5 ఓవర్ల వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. అప్పటికి వెంకటేష్ 70 పరుగులు చేశాడు. దీంతో ఆలౌట్‌ అయ్యేసరికి కోల్‌కతా 169 పరుగులు చేసింది. ముంబైకి 170 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ముంబై బౌలర్లలో తుషార, బుమ్రా మూడేసి వికెట్లు తీశారు. హార్దిక్‌ 2, పీయుష్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 


ముంబైకి అంత సుళువేం కాదు


రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్య వంటి స్టార్లు ముంబై జట్టులో ఉన్నా.. వారు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ముంబై విషయంలో హర్షించదగ్గ విషయమేంటంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రం బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బొమ్మను చూపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో అత్యదిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.