MI vs KKR IPL 2024 Mumbai Indians opt to bowl: కోల్‌కత్తా నైట్‌రైడర్స్(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌గెలిచిన ముంబై(MI) తొలుత బౌలింగ్ తీసుకుంది. మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలైనా సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ముంబైకు విజయం తప్పనిసరి. మరోవైపు కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు చేరేందుకు సమీపంలో ఉన్నా కోల్‌కత్తాకు ఈ మ్యాచ్ కీలకమే. వరుస ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేకుండా చేసుకున్న ముంబైతో .. తిరుగులేని నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కతా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ అభిమానులకు వినోదాన్నిపంచనుంది. నైట్ రైడర్స్ తలపడనుంది. ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. కేకేఆర్ సెకండ్ ప్లేస్‌లో కుర్చీ వేసుకొని కూర్చుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.
రికార్డులు ఇలా...
ఇప్పటి వరకూ ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వాటి ఫలితాలను గమనిస్తే ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ రెండు జట్లూ 31 సార్లు తలపడగా.. ముంబై 23 సార్లు గెలవగా తొమ్మిది సార్లు కేకేఆర్ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన పది మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లు నెగ్గిన ముంబై పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్థానం అంటే తొమ్మిదో స్థానానికే పరిమితమైంది. కోల్‌కతా పరిస్థితి ఐపీఎల్‌లో ఎప్పుడూ లేనంత పాజిటివ్ గా ఈ సీజన్‌లో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింటిని గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
స్టార్లు ఇప్పుడైనా మెరుస్తారా
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్య వంటి స్టార్లు ముంబై జట్టులో ఉన్నా.. వారు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు. ముంబై విషయంలో హర్షించదగ్గ విషయమేంటంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రం బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బొమ్మను చూపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో అత్యదిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 200కు పైగా స్కోర్లు చేయడం ఎంత సులువో ఈ సీజన్‌లో కేకేఆర్ చూపించింది. ఫిల్ సాల్ట్, సునిల్ నరైన్, రింకూ సింగ్ వంటి ప్లేయర్లు బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు అయిదు సార్లు 200కు పైగా స్కోర్లు సాధించింది. రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు బోలింగ్లో కీలకంగా వ్యవహరించడం సైతం జట్టు విజయాలకు బాటలు వేసింది.
టాప్ స్కోర్‌లు ఇవే..
కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోరు 232/2. ఈ టోటల్ కేకేఆర్ 2019 సీజన్‌లో చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా - ముంబై మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు 60 బంతుల్లో 109 పరుగులు. 2012 సీజన్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఎం.ఐ ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ను 27 పరుగుల తేడాతో ఓడించింది. కేకేఆర్ తరఫున 2023లో వెంకటేశ్వర్ అయ్యర్ 104 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినా వెంకటేశ్వర్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇక బౌలర్ల విషయానికొస్తే kkr-mi మ్యాచ్‌లలో బుమ్రా తీసిన 5/10 టాప్ కాగా... రస్సెల్ 5/15, నరైన్ 4/15 ఆ తరువాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.