Gujarat And Punjab Match in IPL 2024: ఐపీఎల్ - 17లో భాగంగా గురువారం గుజరాత్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రాజా వచ్చాడు. పంజాబ్ జట్టు తొలి మ్యాచ్ లో విజయం సాధించగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. మరి ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది.


పంజాబ్ జట్టు


పంజాబ్ జట్టులో ధావన్, బెయిర్ స్టో, జితేశ్, ప్రభుసిమ్రన్, సామ్ కరన్, శశాంక్, సికిందర్, హర్ ప్రీత్, హర్షల్ పటేల్, రబాడా, అర్షదీప్ ఉన్నారు.


గుజరాత్ జట్టు ఇదే


గుజరాత్ జట్టులో వృద్ధిమాన్, గిల్, సుదర్శన్, విలియమ్సన్, విజయ్ శంకర్, ఒమర్జయ్, తెవాటియా, రషీద్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే ఉన్నారు.