IPL Season 1 To Session 14 MS Dhoni Captaincy Record: కెప్టెన్‌ అంటే ఎలా ఉండాలి? అతడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అతడు సహచరులను ఎలా నడిపించాలి? భవిష్యత్తు నాయకుడికి బ్యాటన్‌ ఎలా అప్పగించాలి? అంటే మనకున్న ఒకేఒక్క నిదర్శనం ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)! 12 సీజన్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ను (Chennai Superkings) అమేజింగ్‌గా నడిపించిన మిస్టర్‌ కూల్‌ అందుకు అర్హుడే. కెప్టెన్‌గా అతడు రిటైర్మెంట్‌ ప్రకటించినా చాలామందికి ఎప్పటికీ నాయకుడే. సీఎస్‌కే (CSK) తరఫున మహీ సాధించిన రికార్డులే ఈ విషయం చెబుతాయి.


IPL 2021: ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎంఎస్‌ ధోనీ నాలుగో ట్రోఫీ అందించాడు. గత సీజన్లో చెత్త ప్రదర్శన నుంచి విజేతగా నిలిపాడు. 114 పరుగులూ చేసి తనలో సత్తా ఉందని నిరూపించాడు.


IPL 2020: చెన్నై ఈ సీజన్‌ గురించి ఎంత మర్చిపోతే అంత మంచిది! ఇంత ఘోర ప్రదర్శన చేస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. దుబాయ్‌లో వరుస మ్యాచులు ఓడిపోయి 7వ స్థానంలో నిలిచింది. ధోనీసేన ప్లేఆఫ్‌ చేరని తొలి సీజన్‌ ఇదే! మహీ ఈ సీజన్లో 200 పరుగులే చేశాడు.


IPL 2019: సీఎస్‌కే అమేజింగ్‌ ఫెర్ఫామెన్స్‌కు ఇదో ఉదాహరణ. జట్టును అద్భుతంగా నడిపించిన ధోనీ టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పైగా 416 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్లో ముంబయి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో సీఎస్‌కే రెండో ప్లేస్‌లో ఉండిపోయింది. ధోనీ ఈసారి 416 పరుగులు చేశాడు.


IPL 2018: చెన్నైకి ఇదో కొత్త ఆరంభం! రెండేళ్ల నిషేధం తర్వాత జట్టు ఒక్కటైంది. డాడీస్‌ ఆర్మీగా విమర్శలు పొందింది. కానీ అదే సీనియర్లతో ధోనీ సీఎస్‌కే విజేతగా నిలిపాడు. తమకు తిరుగులేదని మూడో కప్‌ గెలిచాడు. మహీ 455 పరుగులు చేశాడు.


IPL 2015: ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రన్నరప్‌గా నిలిచింది. బౌలింగ్‌లో డ్వేన్‌ బ్రావో, బ్యాటింగ్‌లో మెక్‌ కలమ్‌ వీర విజృంభణతో ధోనీసేన వరుస విజయాలు సాధించింది. ఇది ధోనీ గెలిచిన రెండో కప్పు. ఈసారి మహీ 372 పరుగులు చేశాడు.


IPL 2014: సీఎస్‌కే ఈ సీజన్లో ప్లేఆఫ్‌ చేరుకుంది కానీ ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. మూడో స్థానానికి పరిమితమైంది. కానీ మైదానంలో తమ డామినేషన్‌తో ప్రత్యర్థులను వణికించారు. ధోనీ 371 పరుగులు చేశాడు.


IPL 2013: మరోసారి సీఎస్‌కేను ధోనీ ఫైనల్‌కు చేర్చాడు. కానీ ముంబయి నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. రన్నరప్‌గా నిలిపాడు. ఈసారి మహీ 461 పరుగులు చేశాడు.


IPL 2012: ఈ సీజన్లోనూ సీఎస్‌కేను ధోనీ ఫైనల్‌కు తీసుకొచ్చాడు. సురేశ్‌రైనా తన బ్యాటింగ్‌ సత్తా చూపించాడు. కానీ ఫైనల్లో సీఎస్‌కే టార్గెట్‌ 191ని కోల్‌కతా ఛేజ్‌ చేయడంతో రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. ఈసారి ధోనీ 358 రన్స్‌ చేశాడు.


IPL 2011: సీఎస్‌కేకు ధోనీ ఈసారి రెండో ఐపీఎల్‌ ట్రోఫీ అందించాడు. నంబర్‌వన్‌గా నిలిపాడు. సీఎస్‌కే ఇచ్చిన 206 పరుగుల టార్గెట్‌ను బెంగళూరు ఛేదించలేకపోయింది. మహీ 392 రన్స్‌ చేశాడు.


IPL 2010: చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోనీ తొలిసారి విజేతగా నిలిపాడు. ముంబయి ఇండియన్స్ కలలను భగ్నం చేశాడు. ఇచ్చిన 168 టార్గెట్‌ను ధోనీ కాపాడాడు. ఈ సారి మహీ 287 పరుగులు చేశాడు.


IPL 2009: వరుసగా రెండో ఏడాదీ సీఎస్‌కే ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. నాలుగో స్థానంలో నిలిచింది. మహీ 332 రన్స్‌ కొట్టాడు.


IPL 2008: ఐపీఎల్‌ తొలి సీజన్లోనే సీఎస్‌కేను ధోనీ ఫైనల్‌కు చేర్చాడు. వారిచ్చిన 164 టార్గెట్‌ను రాజస్థాన్‌ను ఛేదించేసింది. దాంతో ధోనీసేన రెండో స్థానంలో నిలిచింది. ధోనీ 414 రన్స్‌ దంచాడు.


*** కొన్ని అవినీతి, స్ఫాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో 2016, 2017లో సీఎస్‌కేను నిషేధించారు. ఆ సమయంలో ధోనీ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ఆడాడు.


Also Read: మళ్లీ షాకిచ్చిన ధోనీ! జడ్డూకు CSK కెప్టెన్సీ అప్పగించిన మిస్టర్‌ కూల్‌!