ఐపీఎల్‌ 2022లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌పై మ్యాచ్‌ గెలిచిన లక్నో సూప్‌ జెయింట్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ను జరిమానా కట్టాల్సి వచ్చింది. మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన రాహుల్‌ స్లోఓవర్‌ రేట్ కారణంగా ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. 


ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన లక్నో టీం 168 పరుగులు చేసింది. అందులో 103 పరుగులు ఒక్క కేఎల్‌ రాహుల్‌వే. అనంతరం బ్యాటింగ్ చేసిన 132 పరుగులు మాత్రమే చేసింది. అందులో తిలక్‌, రోహిత్‌ శర్మ ఇద్దరే రాణించారు. మిగతవారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. 


లక్నో టీంను గెలిపించడానికి వ్యూహాలు వేసే క్రమంలో ఆలస్యం చేశారని కేఎల్‌రాహుల్‌కు జరిమానా విధించి ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్. స్లో ఓవరేట్‌ కు పనిష్‌మెంట్‌గా రాహుల్ తన సాలరీ నుంచి 24 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. 


స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానా చెల్లించడం ఇదేమీ ఆ జట్టుకు కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు రాహుల్. అది కూడా ముంబై మ్యాచ్‌తోనే చెల్లించాడు. ఇప్పుడు రెండోసారి కూడా ముంబైతో మ్యాచ్‌లోనే చేతి చమురు వదిలించుకున్నాడు రాహుల్. 


శతకాల వీరుల జాబితలో టాప్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కేఎల్ రాహుల్ వీర విహారం చేస్తున్నాడు.  ఆదివారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై అజేయ శతకం సాధించి అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరసన నిలిచాడు రాహుల్. 


ముంబై ఇండియన్స్‌పై కేఎల్ రాహుల్ (103 నాటౌట్: 62 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అజేయ శతకం బాదేశాడు. ఇది కేఎల్ రాహుల్ టీ20 కెరీర్‌లో 6వ సెంచరీ. కాగా, రోహిత్ శర్మ సైతం టీ20 ఫార్మాట్లో ఆరు సెంచరీలు చేయడంతో.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత క్రికెటర్ గా రోహిత్ సరసన నిలిచాడు రాహుల్. 


కేఎల్ రాహుల్ అజేయ శతకం సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను లక్నో బౌలర్లు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులకు కట్టడి చేశారు. దీంతో 36 పరుగుల తేడాతో ముంబైలో లక్నో మరో ఘన విజయాన్ని నమోదుచేయగా.. ఐపీఎల్ 2022లో వరుసగా 8వ ఓటమిని చవిచూసింది రోహిత్ సేన. ఐపీఎల్ 15 సీజన్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇంకా ఖాతా తెరవలేదు.