KKR vs MI, IPL 2022 LIVE: 14 బంతుల్లో కమిన్స్ హాఫ్ సెంచరీ.. ఒకే ఓవర్లో 35 రన్స్! అంతే కేకేఆర్ గెలిచేసింది
IPL 2022, KKR vs MI Preview: ఐపీఎల్ 2022 సీజన్ 14వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. మరి వీరిలో పైచేయి ఎవరిది?
డేనియెల్ సామ్స్ వేసిన ఈ ఓవర్లో కమిన్స్ (56) వరుసగా 6, 4, 6, 6, 2, 4, 6 బాదేశాడు. 35 పరుగులు రాబట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. వెంకటేశ్ (50) ఆఖరి వరకు నిలిచాడు. ముంబయి వరుసగా మూడో ఓటమి చవిచూసింది.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ పడటం లేదు. 12 రన్స్ ఇచ్చాడు. కమిన్స్ (22) వరుసగా సిక్స్, బౌండరీ బాదేశాడు. వెంకటేశ్ (50) హాఫ్ సెంచరీ చేశాడు.
తైమల్ మిల్స్ ఈ ఓవర్లో 14 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. తొలి బంతికే ఆండ్రీ రసెల్ (11)ను ఔట్ చేశాడు. అయితే ఆఖరి రెండు బంతుల్ని కమిన్స్ (11) వరుసగా 6, 4 బాదేశాడు. వెంకటేశ్ (49) ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
బుమ్రా 12 పరుగులు ఇచ్చాడు. రసెల్ (11), వెంకటేశ్ (46) చెరో బౌండరీ కొట్టారు.
మురుగన్ అశ్విన్ 8 పరుగులిచ్చి నితీశ్ రాణా (8)ని ఔట్ చేశాడు. వచ్చీ రాగానే ఆండ్రీ రసెల్ (6) సిక్సర్ బాదేశాడు. వెంకటేశ్ (39) నిలకడగా ఆడుతున్నాడు.
తైమల్ మిల్స్ 14 పరుగులు ఇచ్చాడు. వెంకటేశ్ (7) ఒక బౌండరీ, నితీశ్ రాణా (7) ఒక సిక్సర్ బాదేశారు.
మురుగన్ అశ్విన్ 10 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఐదో బంతికి బిల్లింగ్స్ (17)ను ఔట్ చేశాడు. వెంకటేశ్ (31) ఒక సిక్సర్ బాదాడు.
బాసిల్ థంపి 7 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని బిల్లింగ్స్ (16) సిక్సర్‌గా మలిచాడు. వెంకటేశ్ (24) కుదురుగా ఆడుతున్నాడు.
మురుగన్ అశ్విన్ 9 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని సామ్ బిల్లింగ్స్ (9) కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. వెంకటేశ్ (24) నిలకడగా ఆడుతున్నాడు.
తిలక్ వర్మ 6 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని వెంకటేశ్ (23) బౌండరీల కొట్టాడు. సామ్ బిల్లింగ్స్ (1) క్రీజులో ఉన్నాడు.
డేనియెల్ సామ్స్ 9 పరుగులిచ్చి కీలకమైన శ్రేయస్ అయ్యర్ (10)ను ఔట్ చేశాడు. అంతకు ముందు వెంకటేశ్ అయ్యర్ (18) రెండు బౌండరీలు కొట్టాడు.
తైమల్ మిల్స్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. వేసిన తొలి బంతికే అజింక్య రహానె (7)ను ఔట్ చేశాడు. అతడి స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (10) రెండు బౌండరీలు కొట్టాడు. వెంకటేశ్ (9) ఆచితూచి ఆడుతున్నాడు.
బుమ్రా 2 పరుగులు ఇచ్చాడు. అవే గోయింగ్ డెలివరీలతో వెంకటేశ్ (9)ను ఇబ్బంది పెట్టాడు. రహానె (7) నిలకడగా ఆడుతున్నాడు.
బాసిల్ థంపి తన రెండో ఓవర్లోనూ పరుగుల్ని నియంత్రించాడు. అవే గోయింగ్ డెలివరీలతో వెంకటేశ్ అయ్యర్ (8)ను చికాకు పెట్టాడు. అయినప్పటికీ అతడు ఓ బౌండరీ బాదాడు. అజింక్య రహానె (6) ఆచితూచి ఆడుతున్నాడు.
డేనియెల్ సామ్స్ 6 పరుగులు ఇచ్చాడు. వెంకటేశ్ (3), రహానె (6) ఆచితూచి ఆడుతున్నారు.
కోల్‌కతా ఛేజింగ్ మొదలు పెట్టింది. వెంకటేశ్ అయ్యర్ (1), అజింక్య రహానె (2) ఓపెనింగ్‌కు వచ్చారు. బాసిల్ థంపి 3 పరుగులే ఇచ్చాడు.
కమిన్స్ వేసిన ఈ ఓవర్లో 23 పరుగులు ఇచ్చాయి. తొలి బంతికి సూర్య ఔటయ్యాడు. అయితే 3, 5, 6 బంతుల్ని కీరన్ పొలార్డ్ (22; 5 బంతుల్లో) సిక్సర్లు బాదేయడంతో స్కోరు పెరిగింది. తిలక్ (38) నిలకడగా ఆడాడు.
రసెల్ 9 పరుగులు ఇచ్చాడు. సూర్యకుమార్ (52) బౌండరీ కొట్టి తొలి మ్యాచులోనే అర్ధశతకం బాదేశాడు. తిలక్ (38) అతడికి అండగా ఉన్నాడు.
నరైన్ 14 పరుగులు ఇచ్చాడు. సూర్యకుమార్ (47) ఒక బౌండరీ, ఒక సిక్స్ కొట్టాడు. తిలక్ (34) అతడికి అండగా నిలిచాడు.
వరుణ్ చక్రవర్తి 17 పరుగులు ఇచ్చాడు. తిలక్ వర్మ (32) వరుసగా సిక్స్, బౌండరీ కొట్టాడు. ఆఖరి బంతిని సూర్య (36) ఫోర్‌గా మలిచాడు.
నరైన్ 6 పరుగులు ఇచ్చాడు. సూర్య (30), తిలక్ (8) ఆచితూచి ఆడుతున్నారు.
రసిక్ సలామ్ 8 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని సూర్య (26) బౌండరీకి పంపించాడు. తిలక్ (6) అతడికి తోడుగా ఉన్నాడు.
ఉమేశ్ యాదవ్ 13 పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి తిలక్ వర్మ (4) ఇచ్చిన క్యాచును రహానె వదిలేశాడు. సూర్యకుమార్ (20) వరుసగా బౌండరీ, సిక్సర్ కొట్టాడు.
చక్రవర్తి 3 పరుగులు ఇచ్చాడు. సూర్య (9), తిలక్ (2) నిలకడగా ఆడుతున్నారు.
కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 1 పరుగే ఇచ్చి ఆఖరి బంతికి ఇషాన్ కిషన్ (14)ను ఔట్ చేశాడు. సూర్య (8), తిలక్ (౦) క్రీజులో ఉన్నారు.
చక్రవర్తి 5 పరుగులు ఇచ్చాడు. సూర్య (7), ఇషాన్ (14) ఆచితూచి ఆడుతున్నారు.
నరైన్ 3 పరుగులు ఇచ్చాడు. కిషన్ (12), సూర్యకుమార్ (4) నిలకడగా ఆడుతున్నారు.
వరుణ్ చక్రవర్తి సూపర్‌గా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి సిక్సర్ కొట్టిన బ్రూవిస్ (29)ను ఆఖరి బంతికి స్టంపౌట్ అయ్యేలా చేశాడు. కిషన్ (12) నిలకడగా ఆడుతున్నాడు.
నరైన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. నాలుగు పరుగులే ఇచ్చాడు. ఇషాన్ (12), బ్రూవిస్ (23) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.
కమిన్స్ 12 పరుగులు ఇచ్చాడు. ఇషాన్ (10) ఒక బౌండరీ కొట్టాడు. బ్రూవిస్ (21) ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు.
ఉమేశ్ 9 పరుగులు ఇచ్చాడు. బ్రూవిస్ (14) ఒక బౌండరీ బాదాడు. చకచకా డబుల్స్ తీశాడు. ఇషాన్ (5) నిలకడగా ఆడుతున్నాడు.
రసిక్ సలామ్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. 7 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని బ్రూవిస్ (7) బౌండరీకి పంపించాడు. ఇషాన్ (3) ఆచితూచి ఆడుతున్నాడు.
ఉమేశ్ యాదవ్ మరోసారి బ్రేక్ ఇచ్చాడు. తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా లెగ్‌వికెట్‌కు బంతులేసి ఒక్కసారిగా షార్ట్‌పిచ్ బంతితో రోహిత్ (3)ను ఔట్ చేశాడు. ఇషాన్ (2) నిలకడగా ఆడుతున్నాడు.
జమ్ము కశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ రసిక్ సలామ్ అరంగేట్రం చేశాడు. చక్కని స్వింగింగ్ డెలివరీలతో ఆకట్టుకున్నాడు. కేవలం 3 పరుగులే ఇచ్చాడు. రోహిత్ (3), ఇషాన్ (1) ఆచితూచి ఆడుతున్నారు.
ఉమేశ్ యాదవ్ ఎప్పట్లాగే ఫైర్ చూపిస్తున్నాడు. తొలి ఓవర్లో రోహిత్ శర్మ (1)ను దాదాపుగా ఔట్ చేసినంత పనిచేశాడు. ఇషాన్ (0) అవతలి ఎండ్‌లో ఉన్నాడు.
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియెల్ సామ్స్, డివాల్డ్ బ్రూవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, తైమల్ మిల్స్, బాసిల్ థంపి
అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, శామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్, రసిక్ సలామ్, వరుణ్ చక్రవర్తి
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచింది. వెంటనే అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
IPL 2022, KKR vs MI Preview: ఐపీఎల్ 2022 సీజన్ 14వ మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. పుణె ఇందుకు వేదిక. రెండు విజయాలతో కేకేఆర్ జోష్‌తో ఉంది. రెండు పరాజయాలతో ముంబయిలో పట్టుదల పెరిగింది. మరి వీరిలో పైచేయి ఎవరిది? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ ఆటగాళ్ల కీలకం కాబోతున్నారు?
KKRపై MIదే ఆధిపత్యం
ఇండియన్ ప్రీమియర్ లీగు చరిత్రలో ముంబయి ఇండియన్స్ అత్యంత బలమైన జట్టు. ఐదు సార్లు ట్రోఫీలు గెలిచింది. రెండు సార్లు ట్రోఫీలు గెలిచిన కోల్‌కతాపై వారికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. విన్నింగ్ పర్సెంటేజీ 75 శాతం ఉందటేనే అర్థం చేసుకోవచ్చు. లీగులో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడితే రోహిత్ సేన ఏకంగా 22 సార్లు గెలిచింది. కేకేఆర్ 7 విజయాలకే పరిమితమైంది. చివరి సారి తలపడ్డ ఐదు మ్యాచుల్లోనూ 4-1తో ముంబయిదే ఆధిపత్యం. మరి ఈ సీజన్లో రెండు ఆడి రెండూ ఓడిన మాజీ ఛాంపియన్ బోణీ కొడుతుందేమో చూడాలి.
Ishan vs Cummins, Rohit vs Narine చూడాల్సిందే
నేటి మ్యాచులో కొందరు ఆటగాళ్ల మధ్య రైవలరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ముఖ్యంగా కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ఇప్పటికే వరకు మూడు ఇన్నింగ్సుల్లో కేవలం ఐదు బంతులే ఆడి మూడుసార్లు ఔటయ్యాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ బౌలింగ్ రోహిత్ శర్మ (Rohit Sharma) నిలదొక్కుంటాడేమో చూడాలి. ఎందుకంటే 18 ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్‌ను నరైన్ 7 సార్లు ఔట్ చేశాడు. సగటు 19.6. ఇక పుణెలో పేసర్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు లభిస్తున్నాయి.
KKR vs MI Probable XI
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ / అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్‌వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియెల్ సామ్స్, మురుగన్ అశ్విన్, తైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్ / బాసిల్ థంపి, జస్ప్రీత్ బుమ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, టిమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
- - - - - - - - - Advertisement - - - - - - - - -