Karimnagar Mayor Sunil Rao has decided to join BJP : భారత రాష్ట్ర సమితికి ఏదీ కలసి రావడం లేదు. పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు పది మంది కార్పొరేటర్లు కూడా బీజేపీ పంచకు చేరనున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. పట్టణంలో బీజేపీని గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే బీఆర్ఎస్‌లోని కీలక నేతల్ని పార్టీలోకి ఆహ్వానించినటన్లుగా తెలుస్తోంది. బీజేపీలో ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇవ్వడంతో సునీల్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 


ఎన్నికలకు ముందు వరకూ కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య  ఉప్పు నిప్పులా పరిస్థితి ఉండేది. కానీ ఎన్నికల తర్వాత సునీల్ రావు బీజేపీకి దగ్గరయ్యారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ కు దూరం పాటిస్తున్నారు. హైకమాండ్ తనకు ప్రాధాన్యం తగ్గించి డిప్యూటీ మేయర్ కు గుర్తింపు ఇస్తోందని సునీల్ రావు అసంతృప్తికి గురయ్యారు. ఐదేళ్లు క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూపరాణి ఎన్నిక అయ్యారు. మొదట సునీల్ రావు ఎన్నికని కూడా కొంత మంది కార్పోరేటర్లు వ్యతిరేకించారు. అధిష్టానం జోక్యం చేసుకొవడంతో అందరూ‌ సైలెంట్ అయ్యారు. 


 రాష్ట్రంలో బీఅర్ఎస్ అధికారం కొల్పోయిందో అప్పటి నుండి మేయర్ వ్యవహార శైలిలో మార్పు మొదలయ్యాయి. బండి సంజయతో సన్నిహితంగా ఉంటూండటంతో ఆయనపై బీఆర్ఎస్ పార్టీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల కిందట ఆయన అమెరికాకు వెళ్లారు.  నాలుగైదు నెలల పాటు అక్కడే ఉన్నారు. అయితే సంప్రదాయం ప్రకారం  మేయర్ ఇంచార్జ్ బాధ్యతలు డిప్యూటీ మేయర్ కు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏమీచ ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం 15 రోజులు మించి నగరం వదిలిపెట్టిన దేశం దాటిపెట్టి వెళ్లాలన్న జిల్లా కలెక్టర్ కి మున్సిపల్ కమిషనర్ కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అయినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఈ నిబంధనలో ఉల్లంఘించారని నోటీసులు ఇచ్చారు. అయితే ఏచర్యలు తీసుకోలేదు.               


మేయర్, డిప్యూటీ మేయర్లకు  పదవులు ఇప్పించడంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపి వినోద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు.  తర్వాత  మేయర్ సునీల్ రావుకు, మాజీ ఎంపీ వినొద్ కుమార్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ల‌ మధ్య సరిపడని పరిస్థితి వచ్చింది.  బీఅర్ఎస్ అధిష్టానం స్వరూపరాణికి ఉండటంతో మేయర్ తన దారి తాను చూసుకోవాలని డిసైడయ్యారు. పదవి కాలం ఈ నెలతో ముగుస్తుంది. 



Also Read: Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌కు ప్రమాదం - ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు, మంత్రి సేఫ్