Telangana SSC Prefinal Exams Schedule: తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు జనవరి 23న పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకాకం విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీ-ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 15తో పరీక్షలు ముగియనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను మాత్రం గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. ఇక పదోతరగతి వార్షిక పరీక్షలను మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ప్రీ ఫైనల్ పరీక్షల తేదీలివే..
➥ మార్చి 6: ఫస్ట్ లాంగ్వేజ్
➥ మార్చి 7: సెకండ్ లాంగ్వేజ్
➥ మార్చి 10: థర్డ్ లాంగ్వేజ్
➥ మార్చి 11: మ్యాథమేటిక్స్
➥ మార్చి 12: ఫిజికల్ సైన్స్
➥ మార్చి 13: బయోలాజిక్ సైన్స్
➥ మార్చి 15: సోషల్ స్టడీస్
మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు
రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూలును ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 26న మ్యాథమెటిక్స్, మార్చి 28న ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 3న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 4న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
➥ మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
➥ మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
➥ మార్చి 24న ఇంగ్లిష్
➥ మార్చి 26న మ్యాథమెటిక్స్
➥ మార్చి 28న ఫిజికల్ సైన్స్
➥ మార్చి 29న బయోలాజికల్ సైన్స్
➥ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.
➥ ఏప్రిల్ 3న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు థియరీ పరీక్ష.
➥ ఏప్రిల్ 4న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)
ALSO READ:
ఏపీలో పదోతరగతి పరీక్షలు ఎప్పటినుంచంటే?
ఏపీ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూలును ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..