Accident In Minister Uttam Kumar Convoy: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ (Uttam Kumar) కాన్వాయ్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో భద్రతా సిబ్బంది, నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొంతసేపు ఆందోళన నెలకొంది.

Also Read: CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు