Ambati Rayudu Retires:
హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు అందరికీ షాకిచ్చాడు! ఐపీఎల్ 2022 తన చివరి సీజన్ అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది నుంచి లీగ్ ఆడబోనని వెల్లడించాడు. ఇంతకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఇప్పుడు లీగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కానీ అంతలోనే మళ్లీ తన ట్వీట్ డిలీట్ చేశాడు.
'ఇదే నా చివరి ఐపీఎల్ అని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది! ఈ లీగు ఆడుతూ అద్భుతమైన సమయం గడిపాను. 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లకు ప్రాతినిధ్యం వహించాను. ఈ అద్భుతమైన జర్నీకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రేమ పూర్వక ధన్యవాదాలు' అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. మళ్లీ 15 నిమిషాల్లోనే రాయుడు తన మనసు మార్చుకున్నట్టు అనిపిస్తోంది! వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
అసలు చెన్నై సూపర్‌కింగ్స్‌లో ఏం జరుగుతుందో తెలియడానికి కొంత సమయం పట్టేలా ఉంది.