IPL Auction 2024 Full list: దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను రూ. 230 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ వేలంలో ఐపీఎల్ చరిత్రలో ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇద్దరు ఆటగాళ్లు రూ.20 కోట్లకు పైగా ధర పలికారు. ఈ మినీ వేలం (IPL Auction 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ. 24.75 కోట్లతో మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc)ను కొనుగోలు చేసింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలంలో మొత్తం ఎంత డబ్బు ఖర్చు చేశారు? మొత్తం ఎంత మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు?  ఏ దేశానికి చెందిన ఎంత మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారో చూ‌ద్దాం...? 

 

ఏ దేశం నుంచి ఎంతమంది ఆటగాళ్లు అమ్ముడయ్యారంటే..?

టీమిండియా - 42 

ఆస్ట్రేలియా - 6 

శ్రీలంక - 3 

బంగ్లాదేశ్ - 1 

ఇంగ్లండ్ - 6 

వెస్టిండీస్ - 4 

దక్షిణాఫ్రికా - 4 

న్యూజిలాండ్ - 3 

ఆఫ్ఘనిస్తాన్ - 3 

 

ఏ జట్టు ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది? 

చెన్నై సూపర్ కింగ్స్ - 6 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 6 

ఢిల్లీ క్యాపిటల్స్‌- 9 

ముంబై ఇండియన్స్ - 8 

కోల్‌కతా నైట్ రైడర్స్ - 10 

రాజస్థాన్ రాయల్స్ - 5 

పంజాబ్ కింగ్స్ - 8 

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 6 

లక్నో సూపర్ జెయింట్స్ - 6 

గుజరాత్ టైటాన్స్ - 8 

 

ఏ జట్టు ఎంత డబ్బు ఖర్చు చేసింది? 

కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 31.35 కోట్లు 

చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 30.40 కోట్లు 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 20.40 కోట్లు 

ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 19.05 కోట్లు 

ముంబై ఇండియన్స్ - రూ. 16.70 కోట్లు 

రాజస్థాన్ రాయల్స్ - రూ. 14.30 కోట్లు 

పంజాబ్ కింగ్స్ - రూ. 24.95 కోట్లు 

సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 30.80 కోట్లు 

లక్నో సూపర్‌జెయింట్స్ - రూ. 12.20 కోట్లు 

గుజరాత్ టైటాన్స్ - రూ. 30.30 కోట్లు 

 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలంలో భారీ ధర దక్కించుకుంటారనుకున్న అంచనాలు తప్పాయి. దిగ్గజ ఆటగాళ్లకు ఈసారి జరిగిన మినీ వేలంలో నిరాశే ఎదురైంది. అమ్ముడుపోని టాప్‌- 10 ఆటగాళ్లను  ఓసారి పరిశీలిస్తే. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోలేదు. స్మిత్‌ను దక్కించుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు.  స్మిత్‌తో పాటు జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, వాండర్ డసెన్‌, జేమ్స్ విన్స్, సీన్ అబాట్‌, జేమీ ఓవర్టన్, బెన్ డకెట, ఫిలిప్ సాల్ట్, జోష్‌ హేజిల్ వుడ్ అమ్ముడు పోలేదు.