ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేసిందో ఓ లుక్కేద్దాం....


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ప్యాట్‌ కమిన్స్ ‍(రూ. 20.5 కోట్లు), ట్రావిస్ హెడ్ ( రూ. 6.8 కోట్లు). జయ్‌దేవ్‌ ఉనద్కత్‌‍‍( రూ. 1.6 కోట్లు), వనిందు హసరంగ (రూ. 1.5 కోట్లు) ఆకాశ్‌ సింగ్‌ ( రూ. 20 లక్షలు) సుబ్రమణ్యన్( రూ. 20 లక్షలు)


ముంబయి ఇండియన్స్‌: గెరాల్డ్‌ కోయిట్జీ (రూ. 50 లక్షలు), దిల్షాన్‌ మదుశంక (రూ. 4.6 కోట్లు), నువాన్‌ తుషారా (రూ. 4.8 కోట్లు), శ్రేయస్‌ గోపాల్‌  (రూ. 20 లక్షలు), అన్షుల్ కంబోజ్ (రూ. 20 లక్షలు), నమన్ దిర్‌ (రూ. 20 లక్షలు), మహమ్మద్ నబీ (రూ. 1.5 కోట్లు) శివాలిక్‌ శర్మ (రూ. 20 లక్షలు)


చెన్నై సూపర్‌ కింగ్స్‌: డారిల్‌ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్‌ రిజ్వి (రూ. 8.4 కోట్లు), శార్దూల్ ఠాకూర్‌ (రూ. 4 కోట్లు), ముస్తాఫిజర్‌ రహ్మాన్‌  (రూ. 2 కోట్లు) రచిన్‌ రవీంద్ర ( రూ. 1.8 కోట్లు)  అవనీశ్‌ అరవిల్లి (రూ. 20 లక్షలు). 


గుజరాత్‌ టైటాన్స్‌: స్పెన్సర్ జాన్సన్‌ (రూ. 10 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ. 7.4 కోట్లు), ఉమేశ్‌ యాదవ్  (రూ. 5.8 కోట్లు), రాబిన్‌ మింజ్‌ (రూ. 3.6 కోట్లు), సుశాంత్‌ మిశ్రా (రూ. 2.2 కోట్లు), కార్తిక్‌ త్యాగి (రూ. 60 లక్షలు), అజ్మతుల్లా ఒమర్జాయ్‌  (రూ. 50 లక్షలు) మానవ్‌ సుతార్ (రూ. 20 లక్షలు).



రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: అల్జారీ జోసెఫ్‌  (రూ. 11.5 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు) లాకీ ఫెర్గూసన్  (రూ. 2 కోట్లు) టామ్ కరన్ (రూ. 1.5 కోట్లు), సౌరభ్ చౌహాన్‌ ‍( రూ. 20 లక్షలు ) స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు).


ఢిల్లీ క్యాపిటల్స్ : కుమార్‌ కుషగ్రా (7.2 కోట్లు), జాయ్‌ రిచర్డ్‌సన్ (రూ. 5 కోట్లు), హ్యారీ బ్రూక్  (రూ. 4 కోట్లు) సుమిత్ కుమార్  ( రూ. కోటి) షైహోప్‌ ( రూ. 75 లక్షలు), ట్రిస్టన్ స్టబ్స్ ( రూ. 50 లక్షలు ), రసిక్‌ దార్ ( రూ. 20 లక్షలు ), రికీ భుయ్ (రూ. 20 లక్షలు), స్వస్తిక్‌ ఛికారా ( రూ. 20 లక్షలు )


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: మిచెల్ స్టార్క్‌ ( రూ. 24.75 కోట్లు), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్ (రూ. 1.50 కోట్లు‌‌) కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు ), చేతన్‌ సకారియా ( రూ. 50 లక్షలు ), అగస్త్య రఘువన్షి ( రూ. 20 లక్షలు ), రమన్‌దీప్‌ సింగ్ ( రూ. 20 లక్షలు ), ముజీవ్‌ రహ్మాన్ ( రూ. 2 కోట్లు), మనీశ్‌ పాండే ( రూ. 50 లక్షలు), గస్ అట్కిన్‌సన్ (రూ. కోటి ), షకిబ్ హుస్సేన్‌ ( రూ. 20 లక్షలు )


లక్నో సూపర్‌ జెయింట్స్‌: శివమ్‌ మావి ( రూ. 6.40 కోట్లు), ఎం సిద్ధార్థ్ ( రూ. 2.4 కోట్లు),  డేవిడ్‌ విల్లే ( రూ. 2 కోట్లు ), అర్షిన్‌ కులకర్ణి ( రూ. 20 లక్షలు ), అస్టన్‌ టర్నర్ ‍( రూ. కోటి) అర్షద్‌ ఖాన్‌ ( రూ. 20 లక్షలు ).


పంజాబ్‌ కింగ్స్‌: హర్షల్ పటేల్ ‍( రూ. 11.75 కోట్లు) , రిలీ రొసోవ్ ( రూ. 8 కోట్లు), క్రిస్ వోక్స్‌ ( రూ. 4.2 కోట్లు ), శశాంక్‌ సింగ్ ( రూ. 20 లక్షలు ), విశ్వనాథ్‌ ప్రతాప్ సింగ్ ( రూ. 20 లక్షలు ), అషుతోష్ శర్మ ( రూ. 20 లక్షలు), ప్రిన్స్‌ చౌధరి ( రూ. 20 లక్షలు),
టోనీ త్యాగరాజన్‌: (రూ. 20 లక్షలు).


రాజస్థాన్‌ రాయల్స్‌: రోవ్‌మన్ పావెల్ ( రూ. 7.4 కోట్లు), శుభమ్‌ దూబె (రూ. 5. 8 కోట్లు)
నాండ్రీ బర్గర్‌(రూ. 50 లక్షలు), టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌(రూ. 40 లక్షలు), అబిద్ ముస్తాక్: (రూ. 20 లక్షలు).