IPL Mega Auction 2022, International Uncapped Players: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ బెంగళూరు వేదికగా నేడు రెండో రోజు జరుగుతోంది. కీలకమైన ఆటగాళ్లు సురేష్ రైనా, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లాంటి ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్లను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. కానీ జాతీయ జట్టుకు ఆడిన అనుభవం లేని కొందరు ప్లేయర్లకు కాసుల పంట పండింది. అన్ క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి.


సింగపూర్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రేవిస్, భారత అండర్ 19 ప్లేయర్ రాజ్‌వర్ధన్ హంగార్కేకర్‌లను కోట్ల రూపాయాలు వెచ్చించి ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టిమ్ డేవిడ్ గురించి. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రూ.8.25 కోట్లకు టిమ్ డేవిడ్‌ (Tim David Bought by Mumbai Indians for Rs 8.25 crore)ను కొనుగోలు చేసింది. అతను ఇంతకుముందు IPL 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భాగంగా ఉన్నాడు. అతడికి కేవలం ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. అయినా తాజా వేలంలో 8 కోట్లకు పైగా ధర పలికి అంతర్జాతీయ క్రికెటర్లకు ఔరా అనిపించాడు.


విదేశాలకు చెందిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో 18 ఏళ్ల దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్‌ ఉన్నాడు. అతడ్ని సైతం ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల భారీ ధరకు తాజా వేలంలో కొనుగోలు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేశారు. 






వేలంలో జాక్‌పాట్ కొట్టిన విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు..
టిమ్ డేవిడ్ - (సింగపూర్) - 8.25 కోట్ల ముంబై ఇండియన్స్


డెవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) - రూ. 3 కోట్లు ముంబై ఇండియన్స్


ఇటీవల జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌ను టీమిండియాకు అందించిన కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాజ్ బవాను ముంబై ఇండియన్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. రాజ్ బవా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 


Also Read: IPL 2022 Auction: టెక్నికల్ ప్లేయర్ అజింక్య రహానేను అంత తక్కువ ధరకు కొట్టేసిన కేకేఆర్, ఎందుకిలా !


Also Read: IPL 2022 Auction: గంభీర్‌ వ్యూహాలకు ఫిదా! లక్నోను నిజంగానే 'సూపర్‌ జెయింట్‌' చేశాడు!