IPL Auction 2022 Day 2 LIVE Updates: ఆక్షన్ ముగిసింది, ఇక యాక్షనే!
IPL 2022 Mega Auction LIVE Updates: ఐపీఎల్-15 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది. పది జట్ల వ్యూహకర్తలు, ప్రతినిధులు, యజమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలానికి తెరపడింది. ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్ల ధరను దక్కించుకుని.. వేలంలో అత్యధిక ధరను దక్కించుకున్న వారిలో టాప్-5కి చేరుకున్నాడు. దీంతోపాటు క్రీడాకారులు కోటీశ్వరులుగా మారారు. మెగా వేలం ముగియడంతో.. ఇక అందరి చూపు ఐపీఎల్ ప్రారంభం వైపుకు తిరిగింది.
ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లేను రూ. రెండు కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌ను రూ.75 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
డేరిల్ మిషెల్‌ను రాజస్తాన్ రాయల్స్, సిద్ధార్థ్ కౌల్‌ను బెంగళూరు రూ.75 లక్షలకు కొనుగోలు చేశాయి.
దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డర్ డుసెన్‌ను రూ.కోటికి రాజస్తాన్ కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియన్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నైల్‌ను రూ.రెండు కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషంను రూ.1.5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
భారత బౌలర్ ఉమేష్ యాదవ్‌ను రూ. రెండు కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని రూ.కోటికి కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
యువ ఆటగాడు కే.భగత్ వర్మను రూ.20 లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
భారత బౌలర్ వరుణ్ ఆరోన్‌ను రూ.50 లక్షలతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌతీని రూ.1.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.
ఆఫ్ఘన్ బౌలర్ ఫరూనీని రూ.50 లక్షలకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ ఎల్లిస్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
న్యూజిలాండ్ వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.
భారత ఆటగాడు కరుణ్ నాయర్‌ను రూ.1.4 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను రూ. కోట్లతో కోల్‌కతా కొనుగోలు చేసింది.
భారత ఆటగాడు కుల్దీప్ సేన్‌ను రూ.20 లక్షలతో రాజస్తాన్ దక్కించుకుంది.
స్పిన్నర్ కరణ్ శర్మను రూ.50 లక్షలతో ఆర్సీబీ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడిని రూ.50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్‌ను రూ.3.6 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను రూ.2.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను రూ.1.9 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్‌ను రూ. రెండు కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
విధ్వంసక దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ను రూ.మూడు కోట్లతో గుజరాత్ కొనుగోలు చేసింది. మొదటి రోజు వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన మిల్లర్‌కు రెండో రోజు అవకాశం వచ్చింది.
మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న రైనాకు మళ్లీ మొండి చేయి ఎదురైంది. మొదటిరోజు వేలంలో అన్‌సోల్డ్‌గా నిలిచిన వారితో ఒక జాబితా సిద్ధం చేసి చివర్లో మళ్లీ వేలానికి పిలుస్తారు. అయితే ఈ జాబితాలో సురేష్ రైనా లేడని తెలుస్తోంది.
ఈ వేలంలో ఇప్పటివరకు 154 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వీరిలో రూ.కోటికి పైగా ధర పలికిన వారు 92 మంది. మొత్తంగా 509.7 కోట్ల రూపాయలను ఫ్రాంచైజీలు ఖర్చుపెట్టారు.
ఆర్. సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబేలను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.
యువ బ్యాటరీ అనీశ్వర్ గౌతమ్‌ను రూ.20 లక్షలకు బెంగళూరు దక్కించుకుంది.
యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని రూ.20 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది.
రైలే మెరెడిత్‌ను రూ. కోటితో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను రూ.2.4 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ ఆటగాడు షాన్ అబాట్‌ను రూ.2.4 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
భారత యువ ఆటగాడు ప్రశాంత్ సోలంకిని రూ.1.2 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
యువ బౌలర్ చామా మిలింద్‌ను రూ.25 లక్షలతో ఆర్సీబీ కొనుగోలు చేసింది.
భారత యువ బౌలర్ వైభవ్ అరోరాను రూ.2 కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
సుయాష్ ప్రభుదేశాయ్‌ను రూ.30 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
భారత క్రికెటర్ ప్రవీణ్ దూబేను రూ.50 లక్షలతో ఢిల్లీ దక్కించుకుంది.
సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్‌ను రూ.8.25 కోట్లతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
భారత యువ ఆటగాడు సుభ్రాంశు సేనాపతిని రూ.20 లక్షలతో చెన్నై కొనుగోలు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్ ఆడం మిల్నేను రూ.1.9 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ పేస్ బౌలర్ టైమల్ మిల్స్‌ను రూ.1.5 కోట్లతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ ఆటగాడు ఒబెడ్ మెకాయ్‌ను రూ.75 లక్షలకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.
జేసన్ బెహరెండాఫ్‌ను రూ.75 లక్షలకు బెంగళూరు కొనుగోలు చేసింది.
వెస్టిండీస్ బౌలర్ రొమారియో షెపర్డ్‌ను రూ.7.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
న్యూజిలాండ్ స్పిన్నర్ మిషెల్ శాంట్నర్‌ను రూ.1.9 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డేనియల్ శామ్స్‌ను రూ.2.6 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ బ్యాటర్ రూథర్‌ఫోర్డ్‌ను రూ. కోటికి ఆర్సీబీ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్‌ను చెన్నై దక్కించుకుంది.
భారత ఆటగాడు రిషి ధావన్‌ను రూ.55 లక్షలతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.ఎనిమిది కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రొవ్‌మన్ పావెల్‌ను రూ.2.8 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేను రూ. కోటికి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఫిన్ అలెన్‌ను రూ.80 లక్షలతో బెంగళూరు దక్కించుకుంది.
యువ బౌలర్ సిమ్రన్‌జీత్ సింగ్‌ను రూ.20 లక్షలతో చెన్నై దక్కించుకుంది.
యువ బౌలర్ యష్ డాయల్‌ను రూ.3.2 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
అండర్-19 ఆటగాడు రాజ్‌వర్థన్ హంగర్గేకర్‌ను రూ.1.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది
అండర్-19 సంచలనం రాజ్ బవాను రూ.రెండు కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
యువ ఆటగాడు సంజయ్ యాదవ్‌ను రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
వేలంలో ఇప్పుడు 45 నిమిషాల లంచ్ బ్రేక్ తీసుకున్నారు. జిమ్మీ నీషం, క్రిస్ జోర్డాన్, లుంగి ఎంగిడి, షెల్డన్ కాట్రెల్, నాథన్ కౌల్టర్ నైల్, షంసి, క్వయిస్ అహ్మద్, కరణ్ శర్మ, ఇష్ సోధి, పీయూష్ చావ్లా, విరాట్ సింగ్, హిమ్మత్ సింగ్, సచిన్ బేబీ, హర్నూర్ సింగ్, హిమాంషు రాణా, రికీ భుయ్‌లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.
భారత ఆటగాడు మనన్ వోహ్రాను రూ.20 లక్షలతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
భారత ఆటగాడు రింకూ సింగ్‌ను రూ.55 లక్షలతో కోల్‌కతా దక్కించుకుంది.
శ్రీలంక యువ స్పిన్నర్ మహీష్ ధీక్షణను రూ.70 లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
భారత స్పిన్నర్ షాబాజ్ నదీంను రూ.50 లక్షలతో లక్నో కొనుగోలు చేసింది.
యువ స్పిన్నర్ మయాంక్ మార్కండేను రూ. 65లక్షలతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను రూ.1.3 కోట్లతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
భారత పేసర్ నవదీప్ సైనీని రూ.2.6 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
భారత బౌలర్ సందీప్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది.
భారత యువ పేసర్ చేతన్ సకారియాను రూ.4.2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
శ్రీలంక పేసర్ దుష్మంత చమీరను రూ.రెండు కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
భారత పేసర్ ఖలీల్ అహ్మద్‌ను రూ.5.25 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
భారత పేసర్ ఇషాంత్ శర్మపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
భారత ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌ను రూ.90 లక్షలతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
భారత ఆల్‌రౌండర్ శివం దూబేను రూ.నాలుగు కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్‌ను రూ.4.2 కోట్లతో సన్‌రైజర్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఒడియన్ స్మిత్‌ను రూ.ఆరు కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను రూ.1.4 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను రూ.1.7 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్‌ను రూ.1.1 కోట్లతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రూ.11.5 కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
డేవిడ్ మలన్, మార్నస్ లబుషేన్, ఇయాన్ మోర్గాన్, సౌరవ్ తివారీ, ఆరోన్ ఫించ్, పుజారాలపై ఎవరూ ఆసక్తి చూపించలేదు.
భారత బ్యాటర్ మన్‌దీప్ సింగ్‌ను రూ.1.1 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
భారత బ్యాటర్ అజింక్య రహానేను రూ.కోటితో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్‌ను రూ.2.6 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
రెండో రోజు వేలాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రారంభించారు.
ఐపీఎల్ మొదటి రోజు వేలం ముగిసింది. ఈరోజు వేలంలో ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు-ముంబై ఇండియన్స్) అందరికంటే ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తనతో పాటు దీపక్ చాహర్ రూ.14 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్), నికోలస్ పూరన్ రూ.10.75 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్), శార్దూల్ ఠాకూర్ రూ.10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) టాప్-5లో ఉన్నారు. రేపు (ఫిబ్రవరి 13వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు వేలం తిరిగి ప్రారంభం కానుంది.
మొదటి రోజు వేలంలో చివరి ఆటగాడు సందీప్ లమిచానేను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు.
తమిళనాడుకు చెందిన యువ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్‌ను రూ.మూడు కోట్లతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
యువ స్పిన్నర్ సుచిత్‌ను రూ.20 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌ను రూ.75 లక్షలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
యువ స్పిన్నర్ కేసీ కరియప్పను రాజస్తాన్ రాయల్స్ రూ.30 లక్షలతో కొనుగోలు చేసింది.
భారత స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌ను రూ.1.6 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
యువ బౌలర్ అంకిత్ సింగ్ రాజ్‌పుత్‌ను రూ.50 లక్షలతో లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
యువ బౌలర్ తుషార్ దేశ్ పాండేను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
యువ బౌలర్ ఇషాన్ బౌలర్‌ను రూ.25 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
గత ఐపీఎల్ లో రాణించిన యువ బౌలర్ అవేష్ ఖాన్ ను రూ.10 కోట్లతో లక్నో కొనుగోలు చేసింది.
యువ బౌలర్ ఆసిఫ్ ను రూ.20 లక్షలతో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
యువ బౌలర్ ఆకాష్ దీప్ ను రూ.20 లక్షలతో ఆర్సీబీ కొనుగోలు చేసింది.
యువ బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.నాలుగు కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
యువ బౌలర్ బసిల్ తాంపిని రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
ఈ సెట్ లో మహ్మద్ అజారుద్దీన్, విష్ణు సోలంకి, ఎన్ జగదీశన్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.
భారత్ కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను రూ. 60 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
భారత్ కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ ను రూ. 60 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
పంజాబ్ కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ను రూ. 60 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
యువ వికెట్ కీపర్ బ్యాటర్ అనూజ్ రావత్ ను రూ.3.4 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
యువ ఆటగాడు షాబాబ్ అహ్మద్‌ను రూ.2.4 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
యువ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను రూ.3.8 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
యువ బౌలర్ కమలేష్ నాగర్‌కోటిని రూ.1.1 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
యువ ఆల్‌రౌండర్ రాహుల్ టెవాటియాను రూ.9 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
యువ పేసర్ శివం మావిని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.7.25 కోట్లతో దక్కించుకుంది.
యువ సంచలనం షారుక్ ఖాన్‌ను రూ.తొమ్మిది కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలతో సర్ఫరాజ్ ఖాన్‌ను దక్కించుకుంది.
భారత యువ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను రూ.6.5 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ.3.8 కోట్లతో దక్కించుకుంది.
రజత్ పటీదార్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, హరి నిషాంత్‌లు అన్‌సోల్డ్‌గా నిలిచారు.
యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠిని రూ.8.5 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
యువ ఆటగాడు అశ్విన్ హెబ్బర్‌ను రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
‘బేబీ ఏబీ’ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ రూ.మూడు కోట్లతో దక్కించుకున్నారు.
భారత యువ ఆటగాడు అభినవ్ సదరంగానీని రూ.2.6 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
రూ.20 లక్షలతో ప్రియం గర్గ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది.
ఐపీఎల్ వేలానికి 20 నిమిషాల పాటు విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు అమ్ముడు పోయిన వారిలో ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్లు (ముంబై ఇండియన్స్), దీపక్ చాహర్ రూ.14 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ రూ.12.25 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్), నికోలస్ పూరన్ రూ.10.75 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్), శార్దూల్ ఠాకూర్ రూ.10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) టాప్-5లో ఉన్నారు.
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ.6.5 కోట్లతో దక్కించుకుంది.
రూ.5.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ రాహుల్ చాహర్‌ను దక్కించుకుంది.
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను రూ.రెండు కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ జద్రాన్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా, అమిత్ మిశ్రా అన్‌సోల్డ్‌గా నిలిచారు.
బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్‌ను రూ.2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను రూ.10.75 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ రూ.4.2 కోట్లతో దక్కించుకుంది.
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్‌ను రూ.7.5 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజిల్‌వుడ్‌ను రూ.7.75 కోట్లతో బెంగళూరు దక్కించుకుంది.
న్యూజిలాండ్ బౌలర్ లోకి ఫెర్గూసన్‌ను రూ.10 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
భారత పేసర్ ప్రసీద్ కృష్ణను రూ.10 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.
భారత స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
పేస్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లతో దక్కించుకుంది.
భారత పేస్ బౌలర్ నటరాజన్‌ను రూ.నాలుగు కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఇంగ్లండ్ కీపర్ శామ్ బిల్లింగ్స్ అన్‌సోల్డ్‌గా నిలిచారు.
భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను రూ.5.5 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోను రూ.6.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను రూ.15.25 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. నేటి వేలంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడును రూ.6.75 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.
అందరికీ షాకిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్‌ను రూ.6.5 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను రూ.8.25 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగను రూ.10.75 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
మొదటి రోజు లంచ్ తర్వాత ఆక్షనీర్‌గా బ్రాడ్‌కాస్టర్ చారు శర్మ వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
వేలంలో కాస్త అపశృతి చోటు చేసుకుంది. ఆక్షనీర్ హ్యూస్ హెడ్‌మేడస్ హఠాత్తుగా కిందపడిపోయాడు. దాంతో వైద్య సిబ్బంది అతడిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే అతడి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన లేదు. దాంతో లంచ్ విరామం తీసుకున్నారు.
భారత ఆల్‌రౌండర్ దీపక్ హుడాను రూ.5.75 కోట్లతో లక్నో దక్కించుకుంది.
గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్‌ను రూ.8.75 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను రూ.8.75 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
రూ.ఎనిమిది కోట్లతో నితీష్ రాణాను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోను రూ.4.4 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ స్టార్ స్టీవ్ స్మిత్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.
షాకింగ్‌గా సురేష్ రైనాను ఎవరూ కొనుగోలు చేయలేదు.
దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
వేలంలో మొదటి అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచిన డేవిడ్ మిల్లర్
జేసన్ రాయ్ ను గుజరాత్ టైటాన్స్ రూ.రెండు కోట్లతో దక్కించుకుంది.
రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ.రెండు కోట్లతో దక్కించుకుంది.
వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రన్ హెట్ మేయర్ ను రాజస్తాన్ రాయల్స్ రూ.4.6 కోట్లతో దక్కించుకుంది.
భారత బ్యాటర్ మనీష్ పాండేను లక్నో సూపర్ జెయింట్స్ రూ.4.6 కోట్లతో దక్కించుకుంది.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో సెట్-1 ఆటగాళ్ల వేలం పూర్తయింది. రూ.12.25 కోట్లతో శ్రేయస్ అయ్యర్ టాప్‌లో నిలిచాడు. డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను రూ.6.75 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుఫ్లెసిస్‌ను రూ.ఏడు కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది.
టీమిండియా ప్రధాన పేసర్ మహ్మద్ షమీని రూ.6.25 కోట్లతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
టీమిండియా ప్రధాన పేసర్ మహ్మద్ షమీని రూ. కోట్లతో దక్కించుకుంది.
భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటికి ఇదే అత్యధిక మొత్తం.
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడను రూ.9.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్‌తో తన ధర రూ.4.2 కోట్లు మాత్రమే కాగా... ఈసారి రెట్టింపు ధరకు అమ్ముడవటం విశేషం.
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను రూ.7.25 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్‌లో కూడా ఇతన్ని రూ.15.5 కోట్లకు కోల్‌కతానే కొనుగోలు చేసింది. ఇప్పుడు అందులో సగానికి తన ధర పడిపోయింది
స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.ఐదు కోట్లతో రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది.
డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పీచ్‌తో వేలం ప్రారంభం అయింది.
అన్ని జట్ల యాజమాన్య బృందాలు వేలం వేదిక వద్దకు చేరుకుంటున్నాయి. మరో పది నిమిషాల్లోనే వేలం ప్రారంభం కానుంది.
సెట్-4: క్యాప్డ్ వికెట్ కీపర్లు
సెట్-5: క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు
సెట్-6: క్యాప్డ్ స్పిన్ బౌలర్లు
సెట్-7: అన్‌క్యాప్డ్ బ్యాటర్లు
సెట్-8: అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు
సెట్-10: అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు
సెట్-11: అన్‌క్యాప్డ్ స్పిన్ బౌలర్లు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు
సెట్-1: మార్కీ ప్లేయర్లు
సెట్-2: క్యాప్డ్ బ్యాట్స్‌మెన్
సెట్-3: క్యాప్డ్ ఆల్‌రౌండర్లు
Youngest Player, Oldest Player: ఈ ఐపీఎల్ వేలంలో అఫ్గానిస్థాన్‌కు చెందిన నూర్ అహ్మద్ (Noor Ahmad) అత్యంత పిన్న వయస్కుడు. అతడి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. అతిపెద్ద వయస్కుడు ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir). అతడి వయసు 43 ఏళ్లు.
తొలుత కీలక ఆటగాళ్లతో వేలం మొదలవుతుంది. ఇందులో శ్రేయర్ అయ్యర్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, మహ్మద్ షమి, క్వింటన్ డికాక్ వంటి క్రికెటర్లతో వేలం ఆరంభం అవుతుంది.
ఈ వేలంలో దాదాపుగా 20 మంది తెలుగు క్రికెటర్లు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు వికెట్ కీపర్లపై ఆసక్తి నెలకొంది. అంబటి రాయుడు (Ambati Rayudu), కేఎస్ భరత్ (KS Bharat) ఎంత పలుకుతారోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. అంబటికి అనుభవం ఉంది. భరత్ గత సీజన్లో బెంగళూరుకు కీలకంగా నిలిచాడు.
ఐపీఎల్ వేలంలో మొత్తం 217 స్థానాలకు వేలం జరగనుంది. ఈ మెగా వేలానికి దేశ విదేశాల నుంచి మొత్తం 600 మంది పోటీ పడుతున్నారు. తొలి రోజు కేవలం 161 మందిని మాత్రమే వేలం వేస్తారని తెలిసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేనో సీజన్ వేలానికి వేళైంది! సమయం సమీపించే కొద్దీ అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండు రోజుల వేలం కావడం, స్టార్ ఆటగాళ్లు వేలం పరిధిలో ఉండటంతో ఆసక్తి కలుగుతోంది. ఎవరికి ఎక్కువ డబ్బు వస్తుందోననినని వారంతా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వారంతా రూ.2 కోట్ల కనీస ధరలో ఉన్నవారే.
హైదరాబాదీ సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు వికెట్ కీపింగ్ చేస్తానని ప్రకటించాడు. అతడు రూ.2 కోట్ల కనీస ధరలో ఉన్నాడు. అభిమానులైతే అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కీపింగ్ మాత్రమే కాకుండా మిడిలార్డర్‌లో అతడు బలమైన బ్యాటర్‌గా సత్తా చాటాడు.
- పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.72 కోట్లున్నాయి. కేవలం మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్‌ను అట్టిపెట్టుకున్నారు.
- రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.62 కోట్లు ఉన్నాయి. వీరు సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్‌ను రీటెయిన్ చేసుకున్నారు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.57 కోట్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకున్నారు.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.68 కోట్లు ఉన్నాయి. వీరు కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను రీటెయిన్ చేసుకున్నారు.
- కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను అట్టిపెట్టుకున్నారు.
- లక్నో సూపర్‌జెయింట్స్ వద్ద రూ.59 కోట్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, రవి బిష్ణోయ్‌ను డ్రాఫ్ట్ చేశారు.
- ముంబయి ఇండియన్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాను రీటెయిన్ చేసుకుంది.
- చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.48 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వారివద్ద ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌ను రీటెయిన్ చేసుకున్నారు.
- దిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.47.50 కోట్లు ఉన్నాయి. వీరు రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నార్జ్‌ను రీటెయిన్ చేసుకున్నారు.
- గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.52 కోట్లు ఉన్నాయి. ఈ కొత్త జట్టు హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్‌ను డ్రాఫ్ట్ చేసింది.
వేలానికి పేర్లు నమోదు చేసుకున్న 600 మందిలో 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. అలాగే అసోసియేట్ దేశాల నుంచి ఉన్న ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. వేలంలో అందుబాటులో ఉన్న వారిలో 370 మంది ఆటగాళ్లు భారతీయులు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు.
Background
IPL 2022 Mega Auction Day 2 LIVE Updates: ఐపీఎల్-15 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. బహుశా బీసీసీఐ నిర్వహించే చివరి అతిపెద్ద వేలానికి బెంగళూరు ఆతిథ్యం ఇస్తోంది. పది జట్ల వ్యూహకర్తలు, ప్రతినిధులు, యజమానులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ పాలక మండలి మెగా వేలాన్ని పర్యవేక్షిస్తున్నారు.
స్పాన్సర్‌గా టాటా
ఈ సీజన్‌కు టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. దేశవిదేశాల నుంచి దాదాపుగా 600 మంది క్రికెటర్లు వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 217 మందిని ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి. భారత్ నుంచి దాదాపు 370 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
కొత్తగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్లు కూడా చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనుంది. జట్లు రిటైన్ చేసుకున్న 33 మంది కాకుండా మొత్తంగా 590 మంది ఆటగాళ్ల కోసం జట్లు పోటీపడనున్నాయి.
ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని లైవ్ చూడటం ఎలా?
ఈ ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరగనుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేలం జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీలో ఈ వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో కూడా ఈ మెగా వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు.
ఈ వేలంలో మొత్తంగా 590 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఆటగాడికి ఫిక్స్‌డ్ బేస్ ప్రైస్ ఉంటుంది. అత్యధిక బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. మొత్తంగా 48 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -