Mumbai Indians Players IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అత్యధికంగా రూ.15.25 కోట్లతో ఇషాన్ కిషన్‌ను తీసుకుంది. సింగపూర్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్‌కు సైతం రూ.8.25 కోట్లు ఖర్చు పెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్, బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను ముంబై ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకుంది. ఐపీఎల్ 2022 వేలంలో 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.


రీటెయిన్ చేసుకున్న ఆటగాళ్లను పక్కన పెడితే ఇషాన్ కిషన్‌కు రీటెయిన్ చేసుకున్న వారి కంటే ఎక్కువ మొత్తం అందుకోబోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల వివరాలు ఇవే..
రీటెయిన్ ప్లేయర్స్..
రోహిత్ శర్మ
సూర్యకుమార్ యాదవ్‌
కీరన్ పోలార్డ్
జస్ప్రిత్ బుమ్రా


ఐపీఎల్ 2022 వేలంలో తీసుకున్న ఆటగాళ్లు వీరే..
ఇషాన్‌ కిషన్ : రూ. 15.25 కోట్లు
తిలక్‌ వర్మ : రూ. 1.70 కోట్లు
మురుగన్‌ అశ్విన్‌ : రూ. 1.60 కోట్లు
జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ : రూ. 1.30 కోట్లు
మయాంక్‌ మార్కండే : రూ. 65 లక్షలు
సంజయ్‌ యాదవ్ : రూ. 50 లక్షలు
బసిల్ థంపి: రూ. 30 లక్షలు
అర్జున్ టెండూల్కర్‌: రూ. 30 లక్షలు
ఆర్యన్ జుయల్‌  : రూ. 20 లక్షలు
హృతిక్‌ షోకీన్‌  : రూ. 20 లక్షలు
మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌  : రూ. 20 లక్షలు
అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌  : రూ. 20 లక్షలు
రాహుల్‌ బుద్ది  : రూ. 20 లక్షలు
రమణ్‌ దీప్‌ సింగ్‌ : రూ. 20 లక్షలు


ఓవర్సీస్ ప్లేయర్స్..
టిమ్‌ డేవిడ్  : రూ. 8.25 కోట్లు
జొఫ్రా ఆర్చర్ : రూ. 8 కోట్లు
డేవిడ్ బ్రెవిస్‌ : రూ. 3 కోట్లు
డేనియల్‌ సామ్స్‌ : రూ. 2.60 కోట్లు
టైమల్‌ మిల్స్‌ : రూ. 1.50 కోట్లు
రిలే మెరెడిత్ : రూ. 1 కోటి
ఫాబియన్‌ అలెన్ : రూ. 75 లక్షలు 






ఏ ఫ్రాంచైజీ ఎంత మందిని తీసుకుందంటే..  
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (25), పంజాబ్‌ కింగ్స్‌ (25), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (25) ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లతో ఉన్నాయి. రాజస్థాన్‌ రాయల్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్‌ (24), గుజరాత్‌ టైటాన్స్‌ (23), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (23), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (22), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (21) మంది ఆటగాళ్లు (రీటెయిన్, వేలంలో కలిపి)ను తీసుకున్నాయి.  


Also Read: Sunrisers Hyderabad Squad: సన్‌రైజర్స్ పూర్తి జట్టు ఇదే, అత్యధిక రేటు ఎవరికంటే?


Also Read: IPL Auction 2022 : ఐపీఎల్ లో ఛాన్స్ కొట్టేసిన నెల్లూరు కుర్రాడు, ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపిక