IPL News, Sunil Gavaskar Questions Secret Trades: ఐపీఎల్ 2027 సీజన్ రాకముందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లేయర్ల ట్రేడింగ్ లొల్లి స్టార్ట్ అయింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయబోతోందనే ప్రచారం ఊపందుకుంది. 2015 లో ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చిన హార్దిక్, 2022 లో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లి కెప్టెన్ గా టైటిల్ నెగ్గాడు. ఆ తర్వాత ట్రేడింగ్ విండో ద్వారా తిరిగి ముంబైకి వచ్చి కెప్టెన్సీ తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదు. 2024 లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా, 2025 లో క్వాలిఫైయర్ 2 వరకు వెళ్లి, 2026 సీజన్ లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ట్రేడ్ రూమర్స్ నడుమ ముంబై యాజమాన్యం హార్దిక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.
అలాంటివి చేయకూడదు..గావస్కర్ఈ ట్రేడింగ్ వ్యవహారాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా తన కాలమ్‌లో స్పందిస్తూ కీలక విషయాలపై చర్చించాడు. "ఒక ఫ్రాంచైజీ నుంచి మరో జట్టుకు ప్లేయర్ల బదిలీపై మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ట్రేడింగ్ విండో క్లోజ్ కావడానికి ఇంకా సమయం మిగిలుంది. ఒక ఆటగాడి బదిలీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటికీ, ట్రేడ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ వివరాలు కేవలం రెండు ఫ్రాంచైజీలు, ఆ ప్లేయర్, బిసిసిఐకి మాత్రమే తెలుస్తున్నాయి" అని గుర్తు చేశాడు.
నిబంధనాలు పాటించారా..?ట్రేడ్ మనీ వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల ఇతర జట్లలో అనుమానాలు వస్తాయని గవాస్కర్ పేర్కొన్నాడు. "ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జట్టుకు ఉండే నిర్దేశిత శాలరీ క్యాప్ ను పాటించారా లేదా నిబంధనలు ఉల్లంఘించారా అనేది మిగతా ఫ్రాంచైజీలకు తెలియకుండా ఉంటోంది. అందుకే పూర్తి ట్రాన్స్‌పరెన్సీ కోసం ట్రేడ్ అమౌంట్ నంబర్లను కూడా అధికారికంగా బయటపెట్టడం ఎంతో కీలకం" అని పేర్కొన్నాడు.
వేలెత్తి చూపే అవకాశం ఉండకూడదు..ప్రపంచంలోనే బెస్ట్ టీ20 లీగ్ గా ఉన్న ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటానికి పూర్తి పారదర్శకత అవసరమని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. "ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై అసూయపడేవారు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే అన్ని డీల్స్ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి" అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా భవిష్యత్ పై ఇంకా అఫీషియల్ క్లారిటీ రానప్పటికీ ట్రేడింగ్ నిబంధనలపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మరోవైపు హార్దిక్ ట్రేడింగ్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఉన్నాయి.
