Hardik Gujarat Titans Reunion Possible:  ఐపీఎల్ 2027 సీజన్ లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడతాడనే డిస్కషన్ క్రికెట్ సర్కిల్స్‌లో హీటెక్కింది. ముంబై ఇండియన్స్‌తో 2026 సీజన్ తీవ్ర నిరాశను మిగల్చడంతో హార్దిక్ కొత్త జట్టు వైపు చూస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నా, అతడి మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం గుజరాత్ టైటాన్స్ (GT) వైపే మొగ్గు చూపాడు. కెప్టెన్సీ ఇవ్వనందుకు ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయినట్లు ప్రచారం సాగినా, నాయకత్వం లేకపోయినా హార్దిక్, జిటి వైపు వెళ్లడమే కరెక్ట్ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో విశ్లేషించాడు. 

Continues below advertisement

Continues below advertisement

గుజరాత్ తో గోల్డెన్ మెమొరీస్.. అశ్విన్ స్పెషల్ విశ్లేషణ"హార్దిక్ జిటి యాజమాన్యంతో మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. అతడి కేరియర్‌లోనే బెస్ట్ ఫేజ్ గుజరాత్ టైటాన్స్‌లోనే వచ్చింది. బ్యాటింగ్ లోనైనా, కెప్టెన్సీలోనైనా అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు. ముంబైతో టైటిల్ గెలవలేకపోయినా, జిటితో మళ్లీ ఛాంపియన్ గా నిలిచి తన సత్తా నిరూపించుకోవాలనే పట్టుదల అతడిలో ఉంటుంది. ముంబై మంచి ప్యాకేజ్ తీసుకుని ట్రేడ్ చేస్తే హార్దిక్‌కు అది హ్యాపీ ప్లేస్ అవుతుంది. అతడు మళ్లీ జిటి లోకే వెళ్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది" అని అశ్విన్ పేర్కొన్నాడు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ.. నాయకత్వం లేకుండానే ఎంట్రీగుజరాత్ లో ఉండే మంచి బ్యాటింగ్ వికెట్లు హార్దిక్ గేమ్‌కు బాగా సెట్ అవుతాయి. గత రెండేళ్లుగా కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ టీమ్‌ను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. దీంతో హార్దిక్‌కు మళ్లీ కెప్టెన్సీ దక్కే ఛాన్స్ లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని వాడుకుని హార్దిక్,జిటి లో చేరడమే మంచి నిర్ణయమని, ఇది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అశ్విన్ తెలిపాడు. 2022 లో జిటిని ఛాంపియన్ గా నిలిపిన హార్దిక్, 2023 లో ఫైనల్ కు చేర్చిన తర్వాత ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాడు.

ఫ్రాంచైజీల నుంచి నో అఫీషియల్ వర్డ్.. ఆల్రెడీ పంత్, కుల్దీప్ ట్రేడ్స్ఈ ట్రేడింగ్ రూమర్స్‌పై అటు హార్దిక్ పాండ్యా గానీ, ఇటు ముంబై ఇండియన్స్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2026 తర్వాత భారీ ట్రేడ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. లోకల్ స్టార్ రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు రీ-ఎంట్రీ ఇవ్వగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ లో జాయిన్ అయ్యాడు. రాబోయే వేలానికి ముందు హార్దిక్ ఫ్యూచర్ పై ఎలాంటి అనౌన్స్‌మెంట్ వస్తుందో చూడాలి.