2004 India -Pakistan Tour Security Secrets Revealed:  2004 లో జరిగిన చారిత్రాత్మక పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కరాచీలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించాలని ఇండియా అనుమతి కోరినప్పటికీ, భద్రతా కారణాల వల్ల ఆ విజ్ఞప్తిని ఇండియా తిరస్కరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ కీలక పాత్ర పోషించారని మాజీ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆఫీషియల్ యశోవర్ధన్ ఆజాద్ తన తాజా పుస్తకం 'పోలీసింగ్ ది రిపబ్లిక్' లో వెల్లడించాడు.

Continues below advertisement

Continues below advertisement

అద్వానీ నుంచి ఆజాద్ కు అర్జెంట్ ఫోన్ కాల్పాకిస్తాన్‌లోని అన్ని వేదికలను పరిశీలించిన ముగ్గురు సభ్యుల అడ్వాన్స్ సెక్యూరిటీ టీమ్ కు ఆజాద్ హెడ్ గా వ్యవహరించాడు. ముల్తాన్, రావల్పిండి, లాహోర్ లలో టెస్ట్ మ్యాచ్ లకు అనుమతి ఇచ్చిన ఆ కమిటీ, తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నందున కరాచీ, పెషావర్‌లను టెస్ట్ వేదికల జాబితా నుంచి తప్పించింది. ఆ వెంటనే అద్వానీ నుంచి ఆజాద్ కు ఆర్ఏఎక్స్ (RAX) ఫోన్ లో కాల్ వచ్చింది. "కరాచీలో మనం టెస్ట్ మ్యాచ్ నిర్వహించలేమా?" అని అద్వానీ అడిగినప్పుడు, ఎక్కువ రోజుల పాటు అక్కడ ఉండటం టీమ్ కు చాలా రిస్క్ అని ఆజాద్ వివరించాడు. ఆ రిక్వెస్ట్ ముషారఫ్ నుంచి వచ్చిందని తెలిసినా, సెక్యూరిటీ టీమ్ రిపోర్ట్ ను గౌరవిస్తూ అద్వానీ షెడ్యూల్ మార్చకుండా భద్రతా సలహాకే కట్టుబడ్డాడు.

Read Also: Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

అల్ ఖైదా ముప్పు.. రా (RAW) హెచ్చరికలతో అలర్ట్మార్చి 11న మాడ్రిడ్ రైలు బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో ఇండియన్ టీమ్ కరాచీ వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తోంది. పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాల్లో అల్ ఖైదా ఆపరేటివ్స్ ఉన్నారనే సమాచారంతో మేనేజర్ ఆర్ఎస్ శెట్టి, కోచ్ జాన్ రైట్ లతో కలిసి భద్రతా విభాగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. అదే సమయంలో భారత జట్టుకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హైకమిషన్ నుంచి 'రా' (RAW) ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందింది. దీంతో కరాచీ మ్యాచ్ ముగిసిన వెంటనే నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలా లగేజీని ఉదయమే సిద్ధం చేసి ఎయిర్‌పోర్టుకు తరలించారు.

న్యూక్లియర్ బటన్ అడిగిన సచిన్ టెండూల్కర్ఈ టూర్ సమయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో జరిగిన ఒక సరదా సంఘటనను కూడా పుస్తకంలో ఆజాద్ గుర్తుచేసుకున్నాడు. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో బ్లాక్ సూట్ ధరించి బ్రీఫ్‌కేస్ పట్టుకున్న సెక్యూరిటీ గార్డులను చూసి సచిన్ అమాయకంగా "అది న్యూక్లియర్ బటనా?" అని అడిగాడు. అవి జామ్మర్స్ అని చెప్పిన తర్వాత సచిన్ ఎంతో ఆసక్తితో సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఈ 'ఫ్రెండ్‌షిప్ టూర్' లో వన్డే సిరీస్‌ను 3-2తో, టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలుచుకుని చరిత్ర సృష్టించింది.