IPL 2025 SRH VS RR | హైదరాబాద్: ఐపీఎల్ 2019 జరుగుతున్న రెండో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. 18 ఎడిషన్లో రెండో మ్యాచ్లో మాజీ ఛాంపియన్లు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తల పడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగనుంది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీ ఉప్పల్ లో సందడి చేసింది. సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలి టాస్ ఓడటంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగనుంది. సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నాడు. ఫిట్ నెస్ సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తొలి 3 మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ రాజస్తాన్ ను నడిపించనున్నాడు.
Sunrisers Team- ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికెత్, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ
Rajasthan Team- యశస్వీ జైస్వాల్, శుభమ్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మేయర్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ ఫరూకీ
300 పరుగులు చేస్తారా అని సన్ రైజర్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విజృంభించడంతో ఓ మ్యాచ్ లో అత్యధికంగా 287 పరుగులు చేసింది. ఈసారి అంతకుమించి చేయాలని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పవర్ ప్లేలో సైతం గత సీజన్లో 125 పరుగుల రికార్డు స్కోర్ చేశారు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.
ఆస్ట్రేలియా జట్టుకు ఐసీసీ టైటిల్స్ అందించిన అనుభవం పాట్ కమిన్స్ కు కలిసిరానుంది. సన్ రైజర్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదే జట్టును ఐపీఎల్ ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది ఎలాగైనా కప్ కొట్టాలని సన్ రైజర్స్ కసిగా బరిలోకి దిగుతోంది.