IPL 2025 RCB VS KKR Updates: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో మూడుసార్లు ర‌న్న‌ర‌ప్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు శుభారంభం ద‌క్కించుకుంది. శ‌నివారం కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను ఏడు వికెట్ల‌తో చిత్తు చేసింది.  ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 174 ప‌రుగ‌లు చేసింది. అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ (56) తో రాణించాడు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో స‌త్తా చాటాడు. అనంత‌రం ఆర్సీబీ ఛేజింగ్ ను 16.2 ఓవ‌ర్ల‌లోనే మూడు వికెట్ల‌కు 177 ప‌రుగులు పూర్తి చేసి విజ‌యం సాధించింది.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (36 బంతుల్లో 59 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అజేయ ఫిఫ్టీ చేసి జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించాడు. ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఫిఫ్టీతో సత్తా చాటాడు.  బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ (1-27) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అది అటు ఆట‌గాళ్ల‌తోపాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్ష‌కుల‌ను కాస్త అయోమ‌యానికి గురి చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ న‌రైన్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక్క‌సారిగా బెయిల్స్ ప‌డిపోవ‌డంతో ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. 

గ‌మ‌నించిన కోహ్లీ..న‌రైన్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు బంతిని ఆడగా , బ్యాట్ స్వింగ్ అవుతూ వికెట్ల వైపు వెళ్లింది. అయితే న‌రైన్ బ్యాట్ వికెట్ల‌ను తాకిందో లేదో స్ప‌ష్ట‌త లేదు. అయితే ఈ విష‌యాన్ని తొలుత గుర్తించిన స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ.. కీప‌ర్ జితేశ్ శ‌ర్మ‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. న‌రైన్ బ్యాట్ వికెట్ల‌ను తాకిందో లేదో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న చూపంతా బంతిపైనే ఉంద‌ని జితేశ్ తెలిపాడు. ఈ క్రమంలో కోహ్లీ కాస్తా అయోమయానికి గురయ్యాడు. దీంతో న‌రైన్ ఔట్ పై మ‌న‌స్పూర్తిగా ఆర్సీబీ అప్పీల్ చేయ‌లేక పోయింది. అటు అంపైర్లు కూడా దీనిపై అంత‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు. 

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఔట్..ఒక‌వేళ న‌రైన్ బంతి వికెట్లను తాకిన‌ట్ల‌యితే నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ను ఔటైన‌ట్లే.. త‌న‌ను హిట్ వికెట్ గా ప‌రిగ‌ణించి ఔట్ గా ప‌రిగ‌ణిస్తారు. ఇక ఈ మ్యాచ్ లో న‌రైన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కేకేఆర్ ఫుల్ జోష్ లో క‌నిపించింది. ర‌హానే తో క‌లిసి 103 ప‌ర‌గులు జోడించి, న‌రైన్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత అనూహ్యంగా కుప్ప‌కూలి 174 ప‌రుగుల‌కే కేకేఆర్ ప‌రిమిత‌మైంది. ఆ త‌ర్వాత మ‌రో 22 బంతులు మిగిలి ఉండ‌గానే ఆర్సీబీ విజ‌యం సాధించింది. తాజా విజ‌యంతో కేకేఆర్ నెట్ ర‌న్ రేట్ మైన‌స్ 2కి దిగువ‌న ప‌డిపోయింది. నెట్ ర‌న్ రేట్ కీల‌క పాత్ర పోషించే మెగా టోర్నీలో రాబోయే రోజుల్లో కేకేఆర్ ఈ విష‌యంపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.