Robinhood Grand Pre-Release Event: డేవిడ్ భాయ్...‌ వార్నర్ భాయ్... మన తెలుగు ప్రజల అభిమాన ఆస్టేలియా క్రికెటర్! హైదరాబాదీలకు ఇష్టమైన మాజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్! ఇప్పుడు క్రికెటర్ హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టాడు. అది కూడా నితిన్ కోసం! ఆయన నటించిన 'రాబిన్ హుడ్' సినిమా కోసం!


ఐపీఎల్... ట్రైలర్...
హీరో హీరోయిన్లతో వార్నర్ భాయ్!
'రాబిన్ హుడ్' ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ సాయంత్రం జరగనుంది.‌ అది కూడా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో! తొలుత ఈ ట్రైలర్‌ను ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో చేయాలని ప్లాన్ చేశారు, మ్యాచ్ మధ్యలో! కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల అలా జరగలేదు. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేస్తున్నారు. సినిమా హీరోయిన్ నితిన్, అలాగే హీరోయిన్ శ్రీ లీలతో పాటు డేవిడ్ వార్నర్ కూడా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సందడి చేయనున్నారు.‌






హైటెక్స్... ప్రీ రిలీజ్...
ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్!
ట్రైలర్ విడుదల కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నితిన్, శ్రీ లీలతో పాటు డేవిడ్ వార్నర్ హైటెక్ సిటీ సమీపంలోనే హైటెక్స్ నోవాటెల్ హోటల్ వద్దకు చేరుకుంటారు. అక్కడ అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మొదట ఈ ఈవెంట్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే... వర్షం పడుతుందేమో అని అనమానంతో వెన్యూ షిఫ్ట్ చేశారు.‌ హైదరాబాద్ సిటీలో శుక్రవారం రాత్రి వర్షాలు కురిశాయి. రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. ముందు జాగ్రత్తగా వెన్యూ షిఫ్ట్ చేశారు.


Also Readఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?



రెమ్యూనరేషన్ ఎంత?
రోజుకు కోటి రూపాయలు!?
David Warner remuneration for Robinhood movie: 'రాబిన్ హుడ్' సినిమాలో డేవిడ్ వార్నర్ నటించిన సంగతి ఎప్పుడో బయటకు వచ్చింది. ఆయన కోసం యూనిట్ అంతా ఆస్ట్రేలియా వెళ్ళింది. డేవిడ్ వార్నర్ మీద సన్నివేశాలను అక్కడే తీశారు. అయితే ఈ సినిమాలో అతిథి పాత్ర చేసినందుకు ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. రెండు రోజులు మాత్రమే డేవిడ్ వార్నర్ షూటింగ్ చేశారని దాని కోసం రోజుకు కోటి రూపాయల చొప్పున రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం.






మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేశారు.