IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
IPL 2025 SRH vs RR | ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఆదివారం మధ్యాహ్నం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రిజల్ట్ మార్చగల కీలక ఆటగాళ్లు వీరే.

Hyderabad Uppal Stadium | హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి మొదలైంది. నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. అయితే SRH vs RR మ్యాచ్‌లో ఐదుగురు కీలక ఆటగాళ్లు వీరే..
అభిషేక్ శర్మ
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 204 రికార్డ్ స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు సాధించగా.. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ట్రావిస్ హెడ్‌తో పాటు ఓపెనర్‌గా క్రీజులోకి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెరుపు ఆరంభాలు ఇచ్చాడు. పవర్ ప్లేలో ఇతన్ని ఆపకపోతే పరుగుల వరద ఖాయం. గతేడాది ఫైనల్ చేరడంలో అభిషేక్ ఇన్నింగ్స్ లు వర్కౌట్ అయ్చాయి. బౌలింగ్ లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. పార్ట్‌నర్ షిప్ బ్రేక్ చేయగలడు.
ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ జాతీయ జట్టుకు ఆడిన ఇన్నింగ్స్ ల తరహాలో ఐపీఎల్ లోనూ చెలరేగుతుంటాడు. పవర్ హిట్టింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలడు. 15 మ్యాచ్‌ల్లో 40.50 యావరేజీతో 567 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 191.55 తో రాణించాడు. 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ (102)తో గత ఏడాది బెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఎక్కువశాతం బౌండరీల రూపంలో సాధించేస్తాడు.
మహమ్మద్ షమీ
గాయాల కారణంగా ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో, వన్డే ప్రపంచ కప్ లో భారత్ కు విజయాలు అందించాడు. ఐపీఎల్ 2023లో షమీ బెస్ట్ ప్రదర్శన చేశాడు. గుజరాత్ టైటాన్స్ కు ఆడిన షమీ 17 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో SRH తరపున బరిలోకి దిగుతున్నాడు. కమ్మిన్స్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ధృవ్ జురెల్
ఐపీఎల్ 2024లో ధ్రువ్ జురెల్ ఆకట్టుకున్నాడు. కొన్నిసార్లు వెంటనే వికెట్లు చేజార్చుకున్నా, పవర్ స్ట్రోక్ తో రాణించల సామర్థ్యం ఉంది. ధృవ్ జురెల్ 15 మ్యాచ్‌ల్లో 24.38 బ్యాటింగ్ యావరేజీ 138.30 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు సాధించాడు. అయితే భారీ స్కోర్లు చేయకపోవడం మైనస్ పాయింట్. సంజు శాంసన్ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కు వికెట్ కీపర్‌గానూ సేవలు అందించనున్నాడు.
రియాన్ పరాగ్
IPL 2024లో అద్భుతంగా రాణించిన రియాన్ పరాగ్ నేడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అతడు గత ఐపీఎల్ 16 మ్యాచ్‌ల్లో 52 బ్యాటింగ్ సగటుతో 573 రన్స్ చేశాడు. 149 స్ట్రైక్ రేట్‌తో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫినిషింగ్ తో రాయల్స్‌కు మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అతడిపై నమ్మకంతో తాత్కాలికంగా కెప్టెన్సీ వరించింది. మొదటి 3 మ్యాచ్‌లకు శాంసన్ గైర్హాజరీలో రాయల్స్ ను ముందుండి నడిపించనున్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి
ఐపీఎల్ 2024లో వెలుగులోకి వచ్చిన మరో యువ సంచలనం, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఓవరాల్‌గా 15 మ్యాచ్‌లు ఆడగా 11 ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కీలకంగా మారనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ లో తెలుగు వాళ్లు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.