
SRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam
గతేడాది ఐపీఎల్లో భీకరమైన ఫర్ ఫార్మెన్స్ తో ఉప్పల్ లో ఒక్కో టీమ్ ను ఊచకోత కోసిన సన్ రైజర్స్ మరో భారీ టోర్నీకి సిద్ధమైంది. ఈసారి ఐపీఎల్ ప్రయాణాన్ని హైదరాబాద్ వేదికగా మొదలు పెట్టనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఈ రోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ను గెలుచుకుని ఈసారి కప్పు కచ్చితంగా కొట్టేలా కాన్ఫిడెంట్ గా జర్నీ మొదలుపెట్టాలని ఆరెంజ్ ఆర్మీ భారీ ప్లాన్సే వేసింది. ప్రధానంగా ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ఎలా ఇన్నింగ్స్ మొదలుపెడతారన్నే దానిపైనే SRH టెంపో అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్లద్దరికీ తోడు ఈసారి మరో హిట్టర్ ఇషాన్ కిషన్ తోడయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో కాటేరమ్మ పెద్ద కొడుకు హ్రెనిచ్ క్లాసెన్..చిన్న కొడుకు నితీశ్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నారు. సో లాస్ట్ టైమ్ మిస్సయిన 300 పరుగుల రికార్డును సన్ రైజర్స్ ఈ సీజన్ లో కచ్చితంగా కొట్టేస్తుంది అని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ బలంగానే ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి తోడుగా మహ్మద్ షమీ తోడయ్యాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ లాంటి వేరియేషన్ అండ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న బౌలర్లు ఉన్నారు. ఆడమ్ జంపా లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ కి రాహుల్ చాహర్ లాంటి దేశవాళీ స్పిన్నర్ తోడుండటంతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగానూ కనిపిస్తోంది. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ సంజూ శాంసన్ కి గాయం అవ్వటం వాళ్లను బాగా ఇబ్బంది పెట్టే విషయం. సంజూ మొత్తానికి దూరమైతే ఇబ్బంది కాబట్టి 2023లో ధోనిలా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుకోనున్నాడు శాంసన్. అంటే కీపింగ్ ను ధ్రువ్ జురెల్ కి అప్పగించే ఓన్లీ బ్యాటింగ్ కి దిగుతాడు. రియాన్ పరాగ్ శాంసన్ పూర్తిగా కోలుకునే వరకూ గ్రౌండ్ ఉండి కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు వాళ్లకు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ దూరం అవ్వటం కూడా పెద్ద దెబ్బలానే కనపడుతోంది. జైశ్వాల్ కి తోడుగా శాంసన్ ఓపెనింగ్ కి దిగుతాడు. తర్వాత రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మైర్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్ రాజస్థాన్ బ్యాటింగ్ ను ఎంత వరకూ మోస్తారో చూడాలి. బౌలింగ్ లోనూ అంతే జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ పేసర్ వాళ్లకు ఉన్నా...సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, ఫజల్ ఫారూఖీ బౌలింగ్ లో రాణిస్తే తప్ప RR సన్ రైజర్స్ ను నిలపటం ఖాయం. మతీశా తీక్షణ, వనిందు హసరంగలతో స్పిన్ విభాగం మాత్రం బాగుంది. చూడాలి రాజస్థాన్ ఎంత వరకూ సన్ రైజర్స్ కట్టడి చేస్తుందో..లేదా సమర్పయామి అన్నట్లు కాటేరమ్మ కొడుకులకు 300 రికార్డు సమర్పిస్తుందో..మధ్యాహ్నం దేఖేంగే.