KKR vs RR: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మే 4 (ఆదివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 202553వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్తాన్ ఎలాగూ ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయింది. వరుస మ్యాచ్‌లలో గెలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కేకేఆర్ టీమ్ భావిస్తోంది.
KKR ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది, ఇప్పటివరకు నాలుగు విజయాలు, ఐదు ఓటములు, ఒక మ్యాచ్2లో ఫలితం తేలలేదు. తమ లేటెస్ట్ మ్యాచ్ లో, డిఫెండింగ్ ఛాంపియన్లు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించారు.
మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ (RR) తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర ఓటమితో ప్లేఆఫ్ పోటీ నుండి అధికారికంగా నిష్క్రమించింది. IPL ఫస్ట్ సీజన్ ఛాంపియన్లు RR నిరాశపరిచే సీజన్‌ను ఎదుర్కొన్నారు, 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించారు.
KKR vs RR IPL 2025 మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్ల తుది జాబితా..
KKR ప్లేయింగ్ 11: రహమానుల్లా గుర్బాజ్(కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే(కెప్టెన్), అంగ్రిష్ రాఘువంశి, మోయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
RR ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, రియాన్ పరాగ్ (కెప్టెన్), కునల్ సింగ్ రాథోర్, ధ్రువ్ జురెల్(w), షిమ్‌రోన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ థీక్షణ, యుద్విర్ సింగ్ చరక్, ఆకాశ్ మధ్వాల్
టాస్ సమయంలో కెప్టెన్లు ఏమన్నారు..
అజింక్య రహానే: టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాం. మేం ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నాం. రెండవ ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిస్తుందో లేదో నాకు తెలియదు. భారీ స్కోరు చేసి దాన్ని డిఫెండ్ చేసుకోవాలని భావిస్తున్నాం. చివరి మ్యాచ్‌లో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. పరిస్థితులను అంచనా వేసి వేగంగా గేమ్ ప్లాన్ అమలు చేయాలి. నా ఆటపై ఫోకస్ చేసేందుకు శ్రమిస్తున్నాను. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం నాకు చాలా సహాయపడింది. గేమ్ ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. మొయిన్ అలీ, రమణ్‌దీప్ సింగ్ తుది జట్టులోకి తిరిగి వచ్చారు.
రియాన్ పరాగ్: టాస్ ఓడిపోయినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఛేజింగ్ చేయాలనుకున్నాం. మనం మైదానంలో ప్రొఫెషనల్‌గా ఉండాలి. జట్టు గర్వపడేలా ప్రదర్శన చేయాలి. శక్తిని కూటగట్టుకుని మ్యాచ్ లో పర్మార్మెన్స్ తీసుకురావాలి. మా జట్టులో మూడు మార్పులు జరిగాయి. నితిష్ రాణాకు గాయం అయింది. దాంతో అతడు జట్టులో లేడు. కుమార్ కార్తికేయకు బదులుగా హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. కునల్ రాథోర్, యుద్విర్ సింగ్ ప్లేయింగ్ 11లోకి వచ్చారు.