బెంగళూరు: రాయల్ చాలెంజర్స్, బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఉత్కంఠభరిత మ్యాచ్ లో చివరికి 2 పరుగుల తేడాతో సీఎక్కేపై ఆర్సీబీ విజయం సాధించింది. చివరి వరకు సీఎస్కేదే మ్యాచ్ అనిపించినా, చివరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్ తో ఆర్సీబీ గట్టెక్కింది. యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే వికెట్ తర్వాత సీఎస్కే పరిస్థితి మారిపోయింది.
సీఎస్కే ఓపెనర్ మాత్రే ఔట్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ వికెట్ వివాదాలకు కేంద్రమైంది. నిజానికి అతను నాటౌట్. బంతి వికెట్లను హిట్ చేయదు కానీ మొదట అంపైర్ ఔటిచ్చాడు. దాంతో సీఎస్కే బ్యాటర్ రివ్యూకు వెళ్లకుండా నింపాదిగా పరుగులు తీస్తున్నాడు. చివరగా రివ్యూ తీసుకున్న తర్వాత అంపైర్ దాన్ని తోసిపుచ్చాడు. మీ 15 సెకన్ల సమయం ముగిసిందని చెప్పడంతో జడేజా సైతం అంపైర్ తో వాదించినా ప్రయోజనం లేకపోయింది. తరువాత చూస్తే స్క్రీన్‌లో బంతి వికెట్‌ను మిస్ అవుతున్నట్లు కనిపించింది. ఒకవేళ కరెక్ట్ టైంలో రివ్యూ తీసుకుంటే బ్రేవిస్ నాటౌట్ గా ఉండేవాడు. సీఎస్కేకు ప్రయోజనం ఉండేది.
డెవాల్డ్ బ్రేవిస్ తప్పు లేదా?
17వ ఓవర్ మూడవ బంతిలో సీఎస్కే బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ మిస్ కావడంతో బంతి అతని ప్యాడ్‌కు తగిలింది. బౌలర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. డీఆర్ఎస్ రివ్యూకు బదులుగా బ్రేవిస్, రవీంద్ర జడేజా పరుగులు తీశారు. తరువాత వారు డిస్కస్ చేసుకుని డీఆర్ఎస్ తీసుకోవడానికి అంపైర్‌ను అడిగారు. అప్పటికే 15 సెకన్ల టైం సమయం ముగిసిందని అంపైర్ చెప్పాడు. జడేజా సైతం అడిగినా అంపైర్ ఇదే చెప్పడంతో బ్రేవిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక్కడ మరో సాంకేతిక లోపం ఉంది. ఆ టైంలో స్క్రీన్‌లో టైమర్ ప్రారంభం కాలేదు. అంటే ఎన్ని సెకన్లు గడిచిందో బ్యాట్స్‌మన్‌కు తెలియలేదు.
ఒకవైపు సీఎస్కే అభిమానులు టైమర్ ప్రారంభం కాలేదని, బ్యాటర్ కు టైం తెలియదంటున్నారు. మరోవైపు ఆర్‌సీబీ అభిమానులు దానికి బదులిస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. అంపైర్ అవుట్ ఇచ్చిన దాదాపు 25 సెకన్ల తర్వాత వారు రివ్యూ తీసుకోవాలని చూశారు. మ్యాచ్ సమయంలో టైమర్ స్క్రీన్‌లో చూపించకపోతే బ్యాటర్ ఎలా అంచనా వేస్తాడని కమెంటేటర్లు కూడా అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకే మొదట టైమర్ కనిపించలేదు. ఆపై టైమ్ అయిపోయాక బ్యాటర్ రివ్యూకు వెళ్లాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో RCB మరియు CSK అభిమానులు ఘర్షణ
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం వివాదంపై ట్వీట్ చేశాడు. టైమర్ లేకపోవడంతో బ్యాటర్ కు టైం తెలియలేదు. కానీ డెవాల్డ్ బ్రేవిస్‌కు ప్రతికూల నిర్ణయం వచ్చిందన్నాడు.