Virat Kohli equals MS Dhoni in elite Player of the Match awards list: గత రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బోణీ కొట్టింది. ఐపీఎల్(IPL) 17వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి వేదికగా పంజాబ్ కింగ్స్(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్‌లో అదరగొట్టిన ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli)"ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"(Player of the Match)గా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే రెండవ స్థానంలో ఉన్న ధోనీ (MS Dhoni) రికార్డును సమం చేశాడు. ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి ఆ నెంబర్ ను సమం చేశాడు. ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మ 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో టాప్‌లో ఉన్నాడు.
కోహ్లీ మరో రికార్డ్ :
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 కెరీర్‌లో వందో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో 100వ సారి 50 పరుగుల మార్కును దాటిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి టీ20లో 12 వేల పరుగులను అధిగమించాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సాధించాడు.
ఐపీఎల్ 2024(IPL)లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 12000 పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ విరాట్. టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 14,562 పరుగులు చేశాడు. తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 12,993 పరుగులు, కీరన్ పోలార్డ్ 12,430 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.
దినేష్ కార్తీక అరుదైన రికార్డ్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik ) ఐపీఎల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. డెత్ ఓవర్ల లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటి వరకు డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 280 గా ఉండడం విశేషం. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 372 పరుగులు చేశాడు. ఇక అత్యధిక పరుగులు చేసిన వారిలో దినేష్ కార్తీక్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మేయర్ ఉన్నారు.