Gujarat choose to bat : ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పోరులో ఎన్ని రికార్డులు బద్దలవుతాయన్న దానిమీదే అందరికీ ఆసక్తి ఎక్కువ. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును ఎలా నడిపిస్తాడన్నదానిపై ఆసక్తి నెలకొంది. పాండ్యా సారధ్యంలో రోహిత్ ఆటతీరు ఎలా ఉండబోతుందో అన్న దానిపైనా అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో చూపంతా పాండ్యా, రోహిత్ శర్మపైనే ఉండనుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు రికార్డులపైనే ఉన్నాయి. బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్‌లో కూడా రికార్డ్‌లు క్రియేట్ చేశారు ఈ టీం ప్లేయర్లు. గతంలో నమోదైన రికార్డ్‌లు మాత్రమే కాదు వ్యక్తిగతంగా సాధించిన రికార్డ్‌లు ఈ టీంలలో ఆటగాళ్లని శిఖరాగ్రాన నిలబెట్టాయి. మరి ఏంటా రికార్డులు? ఎవరా ఆటగాళ్లు?... రండి ఓ లుక్కేద్దాం.
ఇదీ గత రికార్డ్
ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరిగితే ముంబై రెండు మ్యాచ్‌లు గెలుపొందితే, గుజరాత్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరిసారి గత సీజన్‌లో తలపడినప్పుడు ముంబై 27 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ సీజన్‌లో మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇక ఈ మైదానంలో మెత్తం ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగితే మెదట బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు, రెండవసారి బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలుపొందింది. అత్యధిక స్కోరు 207 పరుగులుగా ఉంది.
ఈ టీంల‌్లో అత్యధిక పరుగుల వీరులుగా సూర్యకుమార్ 139, శుభ్‌మన్‌గిల్114, డేవిడ్ మిల్లర్ 106 పరుగులతో ఉన్నారు. ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో... రషీద్ 8 వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా 4 వికెట్లు తీశారు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోర్ ముంబై ఇండియన్స్ మీదే చేసింది. గత 2023 సీజన్లోనే ఈ ఘనత సాధించింది గుజరాత్. 2023 మే 26న ముంబై ఇండియన్స్ తో అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లకు గుజరాత్ 233 పరుగులు సాధించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోరు సాధించింది టైటాన్స్.
వీళ్ల ఆట ఆసక్తికరం
ఇక మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ వికెట్ కోసం ముంబై బూమ్రాని రంగంలోకి దింపుతుంది. ఇన్నింగ్స్ ఆరంభించే గిల్ ని నియంత్రించాలి అంటే... అది కూడా ఆరంభంలోనే జరగాలి అంటే బూమ్రానే కీలకం. దీంతో కెప్టెన్ పాండ్యా బూమ్రానే నమ్ముకొంటాడు. పవర్‌ప్లేలో వీరి మధ్య ఆట ఆసక్తి కలిగిస్తుంది. ఇక కేన్ విలియమ్సన్ ని ఔట్ చేసే బాధ్యత పాండ్యా తీసుకోనున్నాడు. ఎప్పటిలాగే పవర్‌ప్లేలో ఒక ఓవర్ వేసి విలియమ్సన్ కోసం వేచిచూస్తాడు. ఇక గుజరాత్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ మిల్లర్ ని అడ్డుకోవడానికి మిడిల్ ఓవర్లలో పీయూష్ చావ్లా బాధ్యత తీసుకొంటాడు. కాబట్టి ఈ ఆటగాళ్లు కీలకం కానున్నారు రెండు టీంలకు. రోహిత్‌శర్మ కీలకంగా మారనున్నాడు. ఛాంపియన్ల ఆటంటే రికార్డులే రికార్డులు అనే పరిస్థితి. ఇక కీలక ఆటగాళ్ల పరుగుల దాహం, వికెట్ల వేటతో కొత్త రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. మరి ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో మరిన్ని రికార్డుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.