Kolkata Knight Riders won by 8 wkts: లక్నో(LSG)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా(KKR) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో లక్నోకు ఓ మోస్తరు పరుగులకే కట్టడి చేసిన కోల్‌కత్తా తర్వాత సునాయసంగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 45 పరుగులు, కెప్టెన్ కె.ఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా లక్నోలో మరే బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా సాల్ట్ విజృంభణతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. అయ్యర్ కూడా 38 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో కోల్‌కత్తా మరో 26 బంతులు ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కట్టుదిట్టంగా కోల్‌కత్తా బౌలింగ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను కోల్‌కత్తా బౌలర్లు కట్టడి చేశారు. మొదటి బంతినే డికాక్ బౌండరీకి పంపించి కోల్‌కత్తాకు హెచ్చరికుల పంపాడు. కానీ లక్నో మొదటి వికెట్‌ను 19 పరుగుల వద్ద కోల్పోయింది. ఎనిమిది బంతుల్లో పది పరుగులు చేసిన క్వింటన్ డికాక్‌ను అవుట్ చేసి అరోరా లక్నోకు తొలి షాక్ ఇచ్చాడు. తర్వాత నాలుగో ఓవర్‌లో లక్నోకు మరో షాక్ తగిలింది. 10 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన దీపక్ హుడా పెవిలియన్ చేరాడు. తర్వాత ఆయుష్ బదోని 29 పరుగులతో కలిసి రాహుల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ స్వల్ప వ్యవధిలో రాహుల్, బదోని అవుట్ కావడంతో లక్నో మరోసారి కష్టాల్లో పడింది. కెప్టెన్ కె.ఎల్ రాహుల్ 39 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అవుటవ్వగా.... 29 పరుగులు చేసిన బదోని... నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత నికోలస్ పూరన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సులతో పూరన్ 45 పరుగులు చేశాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో పూరన్‌ను స్టార్క్ అవుట్ చేశాడు. స్టోయినీస్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి వరుణ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కృనాల్ పాండ్యా ఏడు, స్టార్క్ అయిదు పరుగులు చేశారు. నికోలస్ పూరన్ 45 పరుగులు, కెప్టెన్ కె.ఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, వైభవ్ ఆరోరా, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు.
ఫిల్ సాల్ట్ విధ్వంసం
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే రఘువంశీ కూడా ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేసి మోసిన్‌ఖాన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ఫిల్ సాల్ట్- శ్రేయస్స్ అయ్యర్ కోల్‌కత్తాకు ఘన విజయాన్ని అందించారు. ముఖ్యంగా సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసి మరో వికెట్ పడకుండా కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. సాల్ట్ విజృంభణతో మరో 18 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. అయ్యర్ కూడా 38 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణతో కోల్‌కత్తా మరో 26 బంతులు ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.