IPL 2024 KKR vs LSG Kolkata Knight Riders opt to bowl:  ఈడెన్ గార్డెన్స్‌లో లఖ్‌నవూ(LSG)తో మ్యాచ్‌లో  టాస్‌ నెగ్గిన లక్నో కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసిన కోల్‌కత్తా(KKR) గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఓడిపోయి తొలి పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని కోల్‌కత్తా భావిస్తోంది. మరోవైపు అయిదు మ్యాచుల్లో మూడు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో... గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తాపై గెలిచి మళ్లీ గాడినపడాలని రోహిత్‌ సేన చూస్తోంది.


ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ చాలా కీలకం కావడంతో ఇరు జట్లు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు జట్లు గత మ్యాచ్‌లో ఓడిపోవడంతో మళ్లీ విజయాల బాట పట్టేందుకు ఈ మ్యాచ్‌ దోహదపడనుంది. ఆసీస్‌పై సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచిన ఆటగాడు షమార్ జోసెఫ్. ప్రస్తుత ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్నాడు. లఖ్‌నవూ మేనేజ్‌మెంట్ నుంచి డెబ్యూ క్యాప్‌ను అందుకొన్నాడు


కోల్‌కత్తా మొత్తం నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కత్తా తమ సొంత మైదానంలో... లక్నోపై మొదటి  విజయాన్ని నమోదు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది. మరోవైపు లక్నో గత అయిదు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కోల్‌కత్తాపై లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పూర్తి ఆదిపత్యం ప్రదర్శించింది.  


మయాంక్‌ లేకుండానే..


గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయిన లక్నో ఈ మ్యాచ్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. స్పీడ్‌ స్టార్‌, పేసర్‌ మయాంక్ యాదవ్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానుండడం లక్నోకు ప్రతికూలంగా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్య నుంచి వైదొలిగిన మయాంక్‌ ఇంకా కోలుకోలేదు. మయాంక్ స్థానంలో జట్టులోకి వచ్చిన అర్షద్ ఖాన్ అంచనాలు అందుకోలేక పోయాడు. క్వింటన్ డి కాక్, రాహుల్ భారీ స్కోర్లు చేయాలని పట్టుదలగా ఉన్నారు. మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ రాణిస్తే లక్నో భారీ స్కోరు చేస్తుంది. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా కూడా గాడిన పడాల్సి ఉంది.


హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌

కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్  ఐపీఎల్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లోలక్నో విజయం సాధించింది. 2023లో ఈ రెండు జట్లు మద్య జరిగిన చివరి మ్యాచులో లక్నో కేవలం ఒక పరుగు తేడాతో గెలిచింది. 

 


లక్నో సూపర్ జెయింట్స్:


క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్, షమార్ జోసెఫ్, యశ్ ఠాకూర్


 కోల్‌కతా నైట్ రైడర్స్: 


ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రఘువంశి, ఆండ్రి రస్సెల్, రమణ్‌దీప్‌ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి