IPL 2024 KKR vs LSG Kolkata Knight Riders target 162:  కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన కోల్‌కత్తా... లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నికోలస్‌ పూరన్‌ 45 పరుగులు, కెప్టెన్‌ కె.ఎల్‌ రాహుల్‌ 39  పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా లక్నోలో మరే బ్యాటర్‌ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. 



కట్టుదిట్టంగా కోల్‌కత్తా బౌలింగ్‌
 టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను కోల్‌కత్తా బౌలర్లు కట్టడి చేశారు. మొదటి బంతినే డికాక్ బౌండరీకి పంపించి కోల్‌కత్తాకు హెచ్చరికుల పంపాడు. కానీ లక్నో మొదటి వికెట్‌ను 19 పరుగుల వద్ద కోల్పోయింది. ఎనిమిది బంతుల్లో పది పరుగులు చేసిన క్వింటన్‌ డికాక్‌ను అవుట్  చేసి అరోరా లక్నోకు తొలి షాక్‌ ఇచ్చాడు. తర్వాత నాలుగో ఓవర్‌లో లక్నోకు మరో షాక్‌ తగిలింది. 10 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన దీపక్‌ హుడా పెవిలియన్‌ చేరాడు. తర్వాత ఆయుష్‌ బదోని 29 పరుగులతో కలిసి రాహుల్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ స్వల్ప వ్యవధిలో రాహుల్‌, బదోని అవుట్‌ కావడంతో లక్నో మరోసారి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ కె.ఎల్‌ రాహుల్‌ 39  పరుగులు చేసి రస్సెల్‌ బౌలింగ్‌లో అవుటవ్వగా.... 29 పరుగులు చేసిన బదోని... నరైన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. తర్వాత నికోలస్‌ పూరన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సులతో పూరన్‌ 45 పరుగులు చేశాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో పూరన్‌ను స్టార్క్‌ అవుట్‌ చేశాడు. స్టోయినీస్‌ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి వరుణ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కృనాల్‌ పాండ్యా ఏడు, స్టార్క్‌ అయిదు పరుగులు చేశారు. నికోలస్‌ పూరన్‌ 45 పరుగులు, కెప్టెన్‌ కె.ఎల్‌ రాహుల్‌ 39  పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. కోల్‌కత్తా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు, వైభవ్‌ ఆరోరా, సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాతో మ్యాచ్‌లో లక్నో ఫుట్‌బాల్ క్లబ్‌కు ట్రిబ్యూట్‌గా కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. ల‌క్నో ఇప్ప‌టి వ‌ర‌కూ బ్లూ జెర్సీ లో క‌నిపించగా ఈరోజు గ్రీన్, మెరూన్ క‌ల‌ర్ జెర్సీతో మైదానంలో అడుగుపెట్టారు. కోల్‌కతాకు చెందిన మోహన్‌ బగాన్‌ క్లబ్‌ కోసం ఇలా కొత్త జెర్సీతో ఆడుతోంది. 



నరైన్‌, రస్సెల్‌పైనే ఆధారం
కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఎక్కువగా సునీల్‌ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లపైనే  ఆధారపడుతోంది. వీరిద్దరూ విఫలం కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కత్తా ఓడిపోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ (27), రస్సెల్ (10) బ్యాట్‌తో విఫలం కావడంతో కోల్‌కత్తాకు ఓటమి తప్పలేదు. నరైన్‌, రస్సెల్‌ దూకుడుతో గత మ్యాచుల్లో కోల్‌కత్తా 200కుపైగా స్కోరు సాధించింది. కానీ వీరిద్దరూ విఫలం కావడంతో చెన్నైపై కేవలం 137 పరుగులకే పరిమితమైంది. నితీష్ రానా లేకపోవడంతో కోల్‌కత్తా కీలక బ్యాటర్‌ను కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న నితీశ్‌ రానా.... ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారీ స్కోరుపై కన్నేశాడు. గత నాలుగు మ్యాచుల్లో అయ్యర్‌ 0, 39, 18, 34 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఫామ్‌లోకి రావాలని అయ్యర్‌ చూస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మాత్రమే అర్ధ శతకం సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు.