Harshit Rana Fined 60 Percent Match Fees: ఐపీఎల్-2024(IPL2024)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా(KKR) నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి బాల్ లో సన్ రైజర్స్(SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ బంతిని బౌండరీకి తరలించే క్రమంలో విఫలం కావడంతో కోల్‌కత్తా నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా సీమర్ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. సన్‌రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. దీంతో హర్షిత్ రాణాకు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. రాణా మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించారు. కేకేఆర్ విజయంలో బ్యాటింగ్ లో రసూల్, బౌలింగ్ లో హర్షిత్ రాణా కీలక భూమిక పోషించారు.
అసలు ఏం జరిగిందంటే...
ఏమి జరిగిందంటే?
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ రానాను మయాంక్ ఒత్తడిలోకి నెట్టాడు. రానా తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే అవకాశమిచ్చాడు. ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన సంతోషంలో రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్‌గా చూశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. . ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ అధికారులు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినట్లుగా గుర్తించి రానా మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించారు. ఓవరాల్‌గా రానా తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
చివరి వరకు పోరాడినా
ఐపీఎల్(IPL) పదిహేడో సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్(SRH) హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కత్తా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా,.. అండ్రూ రస్సెల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 204 పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసన్.... విధ్వంస ఆటతీరుతో హైదరాబాద్ ను గెలుపు సమీపానికి తీసుకువచ్చాడు...కేవలం 29 బంతుల్లో 8 భారీ సిక్సర్లతో 63 పరోగులు చేసాడు.. చివరి బంతికి అయిదు పరుగులు కావాల్సి ఉండగా డాట్ వేయడంతో హైదరాబాద్ ఓటమి ఖాయం అయింది . చివరి ఓవర్లో ఆరు బాల్స్ కు 13 పరుగులు కొట్టాల్సి ఉంది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అప్పటికే వరుసగా సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. అయితే, చివరి ఓవర్లో షాబాజ్, క్లాసెన్ వికెట్లు తీసిన హర్షిత్ రాణా కేకేఆర్ విజయంలో కీలక భూమిక పోషించాడు.