IPL 2024 Senior cricketers praises Ruturaj: తొలి మ్యాచ్‌లోనే చెన్నై(CSK) కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌( Ruturaj) ఆకట్టుకున్నాడు. మంచి నిర్ణయాలతో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో జట్టును బాగా నడిపించడంతో రుతురాజ్‌పై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రుతురాజ్‌ సారథ్యంపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కొన్నాళ్ల కిందట రుతురాజ్‌ను చూశానని. చెన్నై జట్టుకు ఎప్పుడైనా సరే కెప్టెన్‌ అవుతాడని గతంలోనే పోస్టు పెట్టానని క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతున్న సమయంలో నిశ్శబ్దంగా నిర్ణయాలు తీసుకోవడం అద్భుతమని.. బ్యాటర్‌గానూ నాణ్యమైన షాట్లతో అలరిస్తాడని సచిన్‌ మరోసారి ట్వీట్‌ చేశాడు.


రుతురాజ్‌ బౌలింగ్ మార్పులు సూపర్ అని... ఒత్తిడిలోనూ అతడి నాయకత్వం ఆకట్టుకుందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. రుతురాజ్‌ కెప్టెన్సీ బాగుందని... కానీ కెమెరామెన్‌కు ఓ విజ్ఞప్తని సెహ్వాగ్‌ అన్నాడు. రుతురాజ్‌ను కెమెరాల్లో చూపించండని.. ఎందుకంటే ఇప్పుడతడు చెన్నై కెప్టెన్ అని సెహ్వాగ్‌ తెలిపాడు. కెమెరామెన్‌ మాత్రం ఎక్కువగా ధోనీనే చూపిస్తున్నాడని వ్యంగ్యంగా స్పందించాడు. 


విజయంతో ఆరంభం
ఐపీఎల్ 2024ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. చెపాక్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు వికెట్లు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 


హిట్‌మ్యాన్ భావోద్వేగం


చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని(Ms Dhoni) తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ(Rohit Sharma) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story)లో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్ లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడం... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ కి గుడ్బై చెప్పడంతో ఐపీల్ లో ఒక శకం ముగిసింది... ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ టోర్నీకి ధోమి వీడ్కోలు పలికే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ధోనీ ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.


ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు ఎమ్మెస్ ధోనీ తనదైన స్టైల్లో మరోసారి కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. కెప్టెన్స్ ఫొటోషూట్ కు ముందే ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే సీఈవోకు వెల్లడించాడట. ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఇద్దరూ కెప్టెన్‌లుగా ఉన్న సమయంలో టాస్ వెళ్లినప్పటి ఫొటోను షేర్ చేశాడు.  కింద సింపుల్ గా హ్యాండ్ షేక్ ఎమోజీని ఉంచాడు. 16 ఏళ్ల పాటు ఐపీఎల్లో సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్న ధోనీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ఈ ఫొటోతో అతడు మరో సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు.