Kolkata Knight Riders win by four runs: ఐపీఎల్‌(IPL) పదిహేడో సీజన్‌ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. కోల్‌కత్తా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా,.. అండ్రూ రస్సెల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 201 పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసన్....  విధ్వంస ఆటతీరుతో హైదరాబాద్ ను గెలుపు సమీపానికి తీసుకువచ్చాడు...కేవలం 29 బంతుల్లో 8 భారీ సిక్సర్లతో 63 పరోగులు చేసాడు.. చివరి బంతికి అయిదు పరుగులు కావాల్సి ఉండగా డాట్ వేయడంతో హైదరాబాద్ ఓటమి ఖాయం అయింది


అండ్రూ రస్సెల్‌ విధ్వంసం
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.  కోల్‌కత్తాకు ఫిలిప్‌ సాల్ట్‌ బులెట్‌ ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్లో మూడు సిక్సులు బాదేశాడు. మార్కో జాన్సెన్‌ వేసిన రెండో ఓవర్‌లో మూడు, నాలుగు, ఐదు బంతులను ఫిలిప్‌ సాల్ట్ స్టాండ్స్‌లోకి పంపాడు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన సునీల్ నరైన్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో 23 పరుగుల వద్ద కోల్‌కత్తా తొలి వికెట్‌ కోల్పోయింది. ఓవైపు సాల్ట్‌ విరుచుకుపడుతున్నా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అనంతరం పేసర్ నటరాజన్‌... కోల్‌కతాకు గట్టి షాక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి కోల్‌కతాకు గట్టి షాక్‌ ఇచ్చాడు. వెంకటేశ్ అయ్యర్‌, శ్రేయస్ అయ్యర్‌లను అవుట్ చేశాడు. అయ్యర్‌ కొట్టిన బంతిని మిడాఫ్‌లో కమిన్స్‌ గాల్లోకి ఎగిరి సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 32 పరుగులకే కోల్‌కత్తా మూడు వికెట్లు కోల్పోయింది. 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తాను సాల్ట్‌, రమణదీప్‌ ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన రమణ్‌దీప్‌ సింగ్ 17 బంతుల్లో 35 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్ ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపాడు. ఆ తర్వాత అర్ధ శతకం పూర్తి చేసుకున్న వెంటనే ఫిలిప్‌ సాల్ట్ అవుటయ్యాడు. 40 బంతుల్లో 54 పరుగులు చేసి ఫిలిప్‌ సాల్ట్ ఔటయ్యాడు.  చివర్లో అండ్రూ రస్సెల్‌ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మయాంక్‌ మర్కండే వేసిన 16 ఓవర్‌లో తొలి బంతికి డీప్‌ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌ కొట్టిన రస్సెల్‌.. నాలుగో బంతిని, ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపాడు. ఇందులో ఒక సిక్స్‌ 102 మీటర్ల దూరం పోవడం విశేషం. అండ్రూ రస్సెల్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 


మెరుపు ఆరంభం లభించినా 
అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు... మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు,. తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మాయాంక్‌... రింకూ సింగ్‌ చేతికి చిక్కిపోయాడు. 32 పరుగులు చేసి మయాంక్‌ అవుటయ్యాడు. పవర్‌ ప్లే పూర్తయిన సమయానికి హైదరాబాద్‌ 65/1 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. రసెల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో 32 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ (32) ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో  18 పరుగులు చేసి మార్‌క్రమ్‌ కూడా అవుటయ్యాడు. 20 పరుగులు చేసి త్రిపాఠి కూడా అవుటయ్యాడు.