IPL 2024 Finals match likely to be held in Chennai's MA Chidambaram Stadium: దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) జోరుగా సాగుతోంది. ఉత్కంఠభరిత పోరులు.. క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ధోనీ-కోహ్లీ(Dhoni-Kohli) మధ్య జరిగిన తొలి పోరుతో దేశంలో ప్రారంభమైన ఐపీఎల్ ఫీవర్ పతాక స్థాయికి చేరుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కేవలం తొలి దశ ఐపీఎల్ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ(BCCI)... ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-17 ఫైనల్ వేదిక ఖరారయ్యింది. చెన్నై తుది పోరుకు ఆతిథ్యం ఇవ్వడం దాదాపుగా ఖాయమైంది బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈసారి ఫైనల్‌ను చెన్నైలో నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పాడు. మే 26న ఫైనల్ జరగనుందని అన్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓ క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ను నిర్వహించనున్నారు. త్వరలోనే బీసీసీఐ మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
ఆ నాలుగు జట్లకే అవకాశం
ఐపీఎల్ ఫీవర్ తో దేశం ఊగిపోతోంది.ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ చెన్నై విజయ నినాదంతో ప్రారంభం అయింది. చెపాక్ లో అదిరే రికార్డును కొనసాగించిన చెన్నై...ఆర్సీబీకి మరోసారి షాక్ ఇచ్చింది. అయితే ఈసారి కప్ ఎవరిదో అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానులను ఊపేస్తోంది. అయితే ఈసారి కప్ ఎవరు గెలుస్తారా అన్న దానిపై మాజీ దిగ్గజాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, స్టీవ్ స్మిత్, డేల్ స్టెయిన్ టాప్-4లో నిలిచే జట్ల విషయమై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అంబటి రాయుడు మూడు దక్షిణాది జట్లతోపాటు ముంబై ప్లేఆఫ్స్ చేరుతుందని చెప్పగా.. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం కోల్‌కతా, లక్నో, ముంబై, చెన్నైలను ఫేవరేట్లుగా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తోపాటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటాయని అంచనా వేశాడు. రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్, గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం టాప్-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.
ధోనీ అడ్డాలోనే
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని(Ms Dhoni) తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ(Rohit Sharma) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story)లో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు. ఈ చిత్రలో ధోనీకి రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చి కాంగ్రాట్స్ చెబుతున్నట్లు ఉంది. దీనికితోడు క్యాప్షన్ లో హ్యాండ్‌షేక్ ఎమోజీని కూడా పంచుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడం... మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ కి గుడ్బై చెప్పడంతో ఐపీల్ లో ఒక శకం ముగిసింది... ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ టోర్నీకి ధోమి వీడ్కోలు పలికే అవకాశలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ధోనీ ఐపీఎల్ 2024లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.