Indian Premier League 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఐపీఎల్ 2024కి ముందు నిర్వహించే వేలానికి సంబంధించి భారత క్రికెట్ బోర్డు మార్పులు చేస్తూ ఉంది. ఈసారి వేలం భారత్‌లో కాకుండా దుబాయ్‌లో జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా ఫ్రాంచైజీల పర్స్ విలువలో కూడా పెరుగుదల ఉంటుంది.


ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్ కోసం వేలం దుబాయ్‌లో జరగనుంది. ఇంతకు ముందు దుబాయ్‌లో చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. డిసెంబర్ 19వ తేదీన వేలం జరగనుందని ఈ కథనంలో పేర్కొన్నారు. ఐపీఎల్ 2023 వేలం కొచ్చిలో జరిగింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ వేలం నిర్వహించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


ఈసారి ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీల పర్స్‌లో ఎక్కువ డబ్బు ఉంటుందని చెబుతున్నారు. గతసారి అన్ని ఫ్రాంచైజీల పర్స్ విలువ రూ.95 కోట్లుగా ఉంది. కానీ ఈసారి రూ.5 కోట్ల మేర పెంచనున్నారు. అంటే ఈసారి పర్స్ విలువ రూ.100 కోట్లుగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో జట్లు తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం ఎక్కువగా పోటీ పడవచ్చు.


ఈసారి ఐపీఎల్ వేలంలో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. ఇందులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా చేరనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్, దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ, ఇంగ్లిష్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శామ్ బిల్లింగ్స్ కూడా ఉన్నారు.


2023లో ఆడిన ఐపీఎల్ 16లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) విజయం సాధించింది. ఐపీఎల్ 2023 గెలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial