IND vs PAK: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగనుంది. వన్డే ప్రపంచకప్ వేదికగా భారత్, పాక్ ఇప్పటి వరకు ఏడు సార్లు తలపడ్డాయి. శనివారం జరిగే మ్యాచ్ ఎనిమిదోది అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోను భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో గెలిచి భారత్ తన విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో నైనా గెలవాలని పాక్ భావిస్తోంది.
వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్, పాక్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లను గెలిచాయి. ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్‌పై భారత్ విజయం సాధించగా, నెదర్లాండ్స్, శ్రీలంకపై పాకిస్తాన్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుస విజయాలు అందుకోవడంతోపాటు సెమీస్ అవకాశాలను పెంచుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. భారత్, పాక్ మధ్య ODI గణాంకాలను పరిశీలిస్తే..
- ఓవరాల్‌గా అత్యధిక విజయాలు: భారత్, పాకిస్తాన్ మధ్య 134 వన్డేలు జరిగాయి. పాక్ 73 విజయాలతో ముందంజలో ఉంది.
- ODI ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు: భారత్, పాక్ మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా 7 భారత్ గెలిచింది.
- అత్యధిక టోటల్ స్కోర్: విశాఖపట్నంలో ఏప్రిల్ 5, 2005న 9 వికెట్లకు 356, కొలంబోలో 20223 సెప్టెంబర్ 11న 356 పరుగులు చేసింది
- అత్యల్ప మొత్తం: 1978 అక్టోబర్ 13న సియాల్కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 34.2 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది.
- అతిపెద్ద విజయం: కొలంబోలో 2023 సెప్టెంబర్ 11 జరిగిన మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- అత్యధిక పరుగులు: సచిన్ టెండూల్కర్ 69 వన్డేల్లో 2,526 పరుగులతో రికార్డు సృష్టించాడు.
- అత్యధిక వ్యక్తిగత స్కోరు: చెన్నైలో సయీద్ అన్వర్ 1997 మే 21న 146 బంతుల్లో 194 పరుగులు చేశాడు.
- అత్యధిక సెంచరీలు: సల్మాన్ బట్, సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలతో రికార్డును పంచుకున్నారు.
- అత్యధిక అర్ధశతకాలు: సచిన్ టెండూల్కర్ 69 వన్డేల్లో 16 అర్ధ సెంచరీలు కొట్టాడు.
- అత్యధిక సిక్సర్లు: షాహిద్ ఆఫ్రిది 67 వన్డేల్లో 51 సిక్సర్లు కొట్టాడు.
- అత్యధిక వికెట్లు: వసీం అక్రమ్ 48 వన్డేల్లో 60 వికెట్లు తీశాడు.
- అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: అక్టోబరు 25, 1991న షార్జాలో ఆకిబ్ జావేద్ 37 పరుగులకు 7 వికెట్లు సాధించాడు.
- అత్యధిక ఐదు వికెట్లు: ఆకిబ్ జావేద్ 39 వన్డేల్లో మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు.
- ఒక వికెట్ కీపర్ ద్వారా అత్యధిక అవుట్‌లు: మొయిన్ ఖాన్ 49 వన్డేల్లో 71 అవుట్‌లను నమోదు చేశాడు.
- అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్: మహ్మద్ అజారుద్దీన్ 64 వన్డేల్లో 44 క్యాచ్‌లు అందుకున్నాడు.
- అత్యధిక భాగస్వామ్యం: సెప్టెంబర్ 11, 2023న కొలంబోలో విరాట్ కోహ్లీ, KL రాహుల్ 3వ వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
- ఆడిన అత్యధిక మ్యాచ్‌లు: సచిన్ టెండూల్కర్ 69 వన్డేల్లో పాల్గొన్నాడు.
- కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు: మహ్మద్ అజారుద్దీన్ 25 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు.
ODI ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్
- 1992 ODI ప్రపంచ కప్: భారత్ 43 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
- 1996 ODI ప్రపంచకప్: భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 1999 ODI ప్రపంచకప్: భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది.
- 2003 ODI ప్రపంచకప్: భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- 2011 ODI ప్రపంచకప్: భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 2015 ODI ప్రపంచకప్: భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- 2019 ODI ప్రపంచ కప్: DLS పద్ధతిలో 89 పరుగుల విజయంతో భారత్ విజేతగా నిలిచింది.