IPL Expensive Players Performances: IPL 2023లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడబడ్డాయి. ఈ మ్యాచ్‌లలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కూడా మైదానంలో కనిపించారు. వీటిలో ఈ ఖరీదైన ఆటగాళ్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అది శామ్ కరన్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ వీరందరూ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో స్టార్‌లందరూ ఘోరంగా విఫలమయ్యారు. అటువంటి పరిస్థితిలో జట్లు చాలా ఖరీదైన ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్ల పనితీరు ఎలా ఉందో చూద్దాం.


1. శామ్ కరన్ (పంజాబ్ కింగ్స్)
పంజాబ్ కింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్‌ను రూ. 18.25 కోట్లకు కొనుగోలు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు శామ్ కరనే. అతని ప్రదర్శన గురించి చెప్పాలంటే అతను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 17 బంతుల్లో రెండు సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను బౌలింగ్‌లో 4 ఓవర్ల స్పెల్‌లో 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగలిగాడు.


2. కామెరాన్ గ్రీన్ (ముంబై ఇండియన్స్)
ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ తొలి మ్యాచ్ లో నిస్సహాయంగా కనిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీపై గ్రీన్ బ్యాట్‌తో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో అతను రెండు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చాడు.


3. బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్)
చెన్నై తర్వాతి కెప్టెన్‌గా భావిస్తున్న స్టోక్స్ కూడా తొలి మ్యాచ్‌లో పూర్తిగా విఫలం అయ్యాడు. తొలి మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో మోకాలి గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.


4. హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ పూర్తిగా విఫలం అయ్యాడు. రాజస్థాన్‌పై బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్ 21 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు.


5. కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్)
కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.


మరోవైపు విరాట్ కోహ్లీ 2023లో తన ఫాంను తిరిగి తెచ్చుకున్నాడు. దాన్ని ఐపీఎల్ 2023లో కూడా కొనసాగించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయమైన అర్థ సెంచరీతో జట్టును గెలిపించాడు. కేవలం 49 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.


ఇది విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో 50కి పైగా పరుగులను సాధించడం ఇది 50వ సారి. ఈ మార్కును అందుకున్న మొదటి భారతీయ బ్యాటర్ విరాట్ కోహ్లీనే. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60 అర్థ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. విరాట్ రెండో స్థానంలో ఉండగా, 49 సార్లు ఈ ఫీట్ సాధించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 45 అర్థ సెంచరీలు, ఐదు సెంచరీలను ఐపీఎల్‌లో సాధించాడు.