CSK vs LSG Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2023లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. అంతకుముందు, చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసేందుకు చెన్నై జట్టు లక్నోతో తలపడనుంది.
మరోవైపు లక్నో IPL 2023ని గొప్ప విజయంతో ప్రారంభించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో లక్నో ఉత్సాహంతో చెన్నైపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని బరిలోకి దిగనుంది.
పిచ్ రిపోర్ట్
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంత మైదానం. మరోవైపు ఇక్కడి పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మైదానం పిచ్ చాలా స్లోగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్పిన్నర్లు కీలకం కానున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో స్పిన్నర్లు ఎక్కువగానే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారి సొంత మైదానంలో వారిని ఓడించడం చాలా కష్టం.
మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈరోజు (ఏప్రిల్ 3వ తేదీ) రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. వివిధ భాషల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌ను 'జియో సినిమా' యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. మీరు ఈ యాప్‌లో ఈ మ్యాచ్‌ని ఉచితంగా చూడవచ్చు. ఇక్కడ కూడా వివిధ భాషల్లో మ్యాచ్‌ని ఆస్వాదించే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే/ప్రశాంత్ సోలంకి, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్‌గేకర్
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోనీ/కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్.