Varun Dhawan : బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో హాలీవుడ్ మోడల్ జిగి హడిద్‌ను తన చేతుల్లో పైకి ఎత్తుకుని, ఆమె చెంపపై ముద్దు పెట్టడంపై సోషల్ మీడియాలో ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. దీన్ని తాము ఊహించలేదని, వరుణ్ ధావన్ పనితో ఆమె అసౌకర్యంగా ఫీలయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ట్రోలర్లకు సమాధానంగా వరుణ్ ధావన్ రిప్లై కూడా ఇచ్చాడు. ఇదంతా ప్లాన్ లో భాగమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలువురు నెటిజన్లు వరుణ్ ధావన్ ను టార్గెట్ చేసి, ప్రశంసలతో పాటు విమర్శలు సంధిస్తున్నారు.


పంజాబీ కుటుంబానికి చెందిన వరుణ్ ధావన్.. 'మై నేమ్ ఈజ్ ఖాన్' అనే సినిమాతో 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన సహాయ దర్శకునిగా పనిచేశారు. 2012లో కరణ్ దర్శకత్వంలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకి వరుణ్ ధావన్ కు 'ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ' నామినేషన్ పొందారు. ఆ తర్వాత 'హంప్టీ శర్మాకీ దుల్హనియా' (2014), 'ఎబిసిడి2' (2015) వంటి సినిమాల్లో నటించారు. 'ఎబిసిడి2' సినిమా ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ వసూళ్ళు సాధించింది. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన 'బద్లాపూర్' (2015) సినిమాతో ఉత్తమ నటుడు కేటగిరీలో 'ఫిలింఫేర్ పురస్కారాని'కి నామినేషన్ పొందడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.


ముంబయిలో  ఏర్పాటు చేసిన 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' గ్రాండ్ ప్రారంభోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రెండవ రోజు స్టార్ నటులు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రాతో పాటు అనేక ఇతర ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు స్టేజ్ పై ప్రదర్శనలిచ్చారు. అందులో భాగంగా నటుడు వరుణ్ ధావన్ సైతం వేదికపై డ్యాన్స్ చేసి అలరించాడు. ఈ సమయంలోనే స్టేజ్ పైకి వచ్చిన హాలీవుడ్ సూపర్ మోడల్ జిగి హడిద్‌ను తన చేతుల్తో పైకి ఎత్తి, చుట్టూ తిప్పాడు. ఆ వెంటనే ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. దీంతో ఆమె వెంటనే కిందకు దిగి, స్టేజ్ పై నుంచి కిందికి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 


ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  జిగి హడిద్‌ ను అలా పైకి ఎత్తడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ముద్దు పెట్టుకోవడంతో అసౌకర్యంగా ఫీలయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


 జిగి హడిద్‌ను ముద్దు పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ పై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ అన్నింటికీ తాజాగా ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఇదంతా 'తాము ప్లాన్ ప్రకారమే చేశామ'ని క్లారిటీ ఇచ్చాడు.  దీంతో నెటిజన్లు మరోసారి ఆయనపై విమర్శలు సంధిస్తున్నారు. మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదంతా ప్లా్న్డ్ అయితే.. ఆమెను ముద్దు పెట్టుకోవడం, అసౌకర్యంగా ఫీలవడం కూడా ప్లానింగ్ లో భాగమేనా అంటూ నిలదీస్తున్నారు. 


https://twitter.com/Varun_dvn/status/1642400418448769024


ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ చిరకాల కోరికైన ఎన్ఎంఏసీసీని (Nita Mukesh Ambani Cultural Central) మార్చి 31న అంగరంగవైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత్‌తోపాటు విదేశీ సినీ సెలబ్రిటీలు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో నీతా అంబానీ చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ అబ్బురపరిచింది. ‘రఘుపతి రాఘవ రాజా రామ్’ పాటకు ఆమె ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.