RR vs LSG Preview: 


ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో బుధవారం సూపర్ డూపర్‌ కాంటెస్ట్‌ జరగబోతోంది. టేబుల్‌ టాపర్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (RR vs LSG) తలపడుతున్నాయి. సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇందుకు వేదిక. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. రాయల్స్‌పై సూపర్‌ జెయింట్స్‌ ప్రతీకారం తీర్చుకోగలరా?


సంజూ సేన.. డేంజరస్‌!


రాజస్థాన్‌ రాయల్స్‌కు (Rajasthan Royals) ఈ సీజన్లో ఎదురులేదు. ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు సృష్టించుకుంటున్నారు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఎవరో ఒకరు ఎప్పుడూ అటాకింగ్‌ మోడ్‌లోనే ఉంటున్నారు. దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. పడిక్కల్‌ కొంత ఫర్వాలేదు. ఇక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) బ్యాటింగ్‌కు తిరుగులేదు. ఎలాంటి బౌలరైనా అతడి ముందు దిగదుడుపే! మిడిలార్డర్లో హెట్‌మైయిర్‌ మ్యాచులను ఫినిష్‌ చేస్తున్న తీరు అమేజింగ్‌! అశ్విన్‌, ధ్రువ్‌ జోరెల్‌ బ్యాటుతో ఇంపాక్ట్‌ చూపిస్తున్నారు. ఇక ట్రెంట్‌బౌల్ట్‌ పవర్‌ ప్లేలోనే కనీసం 2 వికెట్లు అందిస్తున్నాడు. సందీప్ శర్మ కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్తులో బంతులు వేస్తున్నాడు. యూజీ, యాష్‌, జంపా స్పిన్‌ బాగుంది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటున్నాడు.


రాహుల్‌.. మారాలి!


లక్నో సూపర్‌ జెయింట్స్ (Lucknow Super Giants) ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతోంది. అయితే కొన్ని మూమెంట్స్‌లో వెనకబడి గెలిచే మ్యాచుల్ని చేజార్చుకుంటోంది. గతేడాది రెండు మ్యాచుల్లోనూ లక్నోపై రాయల్స్‌దే విక్టరీ! అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్‌ సేన పట్టుదలగా ఉంది. కైల్‌ మేయర్స్‌ అటాకింగ్‌తో క్వింటన్ డికాక్ మరికొన్ని మ్యాచుల్లో రిజర్వు బెంచీకి పరిమితం కాక తప్పదు. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన అప్రోచ్‌ మార్చుకోవడం బెటర్‌! మెరుపు ఓపెనింగ్స్‌ ఇవ్వాలి. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్య ఇంకా స్ట్రగుల్‌ అవుతున్నారు. నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran), మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis) డిస్ట్రక్టివ్‌గా ఆడటం ప్లస్‌పాయింట్‌. ఆయుష్‌ బదోనీ ఫర్వాలేదు. కృష్ణప్ప గౌతమ్‌ షాట్లు ఆడగలడు. మార్క్‌వుడ్‌ పేస్‌ బాగుంది. అవేశ్‌ మరింత తెలివిగా బౌలింగ్‌ చేయాలి. కుర్రాడు యుధ్‌వీర్‌ సింగ్‌ పేస్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్‌, కృనాల్‌, కృష్ణప్ప, అమిత్‌ మిశ్రా స్పిన్‌ బాగుంది. అన్ని రకాలుగా కట్టడి చేస్తున్న లక్నో.. ప్రత్యర్థికి ఏదో ఒక చోట మూమెంటమ్‌కు అవకాశం ఇస్తోంది. దీన్ని తగ్గించుకుంటే ఈజీగా గెలవొచ్చు.


రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.


లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.